మంగళవారం 31 మార్చి 2020
Adilabad - Jan 12, 2020 , 01:47:18

ఘనంగా గురుకృప దివస్‌

ఘనంగా గురుకృప దివస్‌నార్నూర్‌ : మండలంలోని కొత్తపల్లి(హెచ్‌) గ్రామంలోని దీక్షభూమి ఆలయంలో శనివారం గురు, శిష్యుల మిలాన్‌ దివస్‌ను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయంలో కొలువు దీరిన  దుర్గామాత, సేవాలాల్‌మహరాజ్‌, ధర్మ గురువు రామారావ్‌ మహరాజ్‌కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలతోపాటు ఇతర రాష్ర్టాల నుంచి భక్తులు భారీగా తరలిరావడంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. అంతకుముందు లంబాడాలు గంగాపూర్‌ నుంచి శ్రీ సేవాలాల్‌ మహరాజ్‌ పల్లకీని తీసుకవచ్చారు. మహిళలు చేసిన నృత్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఆధ్యాత్మిక గురువు ప్రేమ్‌సింగ్‌ మహరాజ్‌ ఆధ్వర్యంలో బోగ్‌బండార్‌ నిర్వహించారు. గురుకృప దివస్‌కు ఉమ్మడి జిల్లాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టాల నుంచి భక్తులు భారీగా తరలిరావడంతోఆలయ ప్రాగణం కిటకిటలాడింది. 

దీక్షభూమి అభివృద్ధికి కృషి చేస్తాం...

దీక్షభూమి అభివృద్ధికి తమవంతు కృషి చేస్తామని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ జనార్దన్‌రాథోడ్‌, బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావ్‌ అన్నారు. గరుకృప దివస్‌ సందర్భంగా  ప్రేమ్‌సింగ్‌మహరాజ్‌ ఆశీస్సులు పొందారు. సేవాలాల్‌ మహరాజ్‌ పల్లకీకి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలిండియా బంజారా సేవాసంఘ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యాంనాయక్‌, అనిల్‌జాదవ్‌, ఠాగ్రూనాయక్‌, గంగారామ్‌, ఎంపీటీసీ జాదవ్‌ రేణుక, ఉట్నూర్‌ జడ్పీటీసీ చారులత, ఆలయకమిటీ సభ్యులు  ఉన్నారు.


logo
>>>>>>