గురువారం 02 ఏప్రిల్ 2020
Adilabad - Jan 12, 2020 , 01:46:40

ఉట్నూర్‌కు చేరిన గంగాజల యాత్ర

ఉట్నూర్‌కు చేరిన గంగాజల యాత్ర


ఉట్నూర్‌, నమస్తే తెలంగాణ : నాగోబా జాతర నేపథ్యంలో  గంగాజలం  సేకరణకు తరలిన మెస్రం వంశీయులు శుక్రవారం రాత్రి ఉట్నూర్‌ మండలానికి చేరుకున్నారు. స్థానిక మెస్రం వంశీయులు వారికి ఘన స్వాగతం పలికి సౌకర్యాలు ఏర్పాటుచేశారు. శనివారం వీరి యాత్ర ధర్ముగూడ మీదుగా తేజాపూర్‌ గ్రామానికి చేరుకుంది. ఈ సందర్భంగా మెస్రం వంశీయులు మాట్లాడుతూ గిరిజనులకు పుష్యమాసం ఎంతో విశిష్టమైందన్నారు. 14న మంచిర్యాల జిల్లా హస్తలమడుగుకు చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి జారిలో గంగాజలం తీసుకొని తిరిగి వస్తామని 24న మహాపూజ చేస్తామన్నారు. అనంతరం జాతర ప్రారంభిస్తామన్నారు. అనంతరం ఎంపీపీ పంద్ర జైవంత్‌రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో తుకుడోజీ, వెంకట్‌రావు, తిరుపతి, బాజీరావు, చిన్ను పటేల్‌, బాదిరావు, లింబారావు, కటోడ హనుమంత్‌రావు, పర్ధాంజీ, మనోహర్‌, దుర్గు, కోశరావు, నాగోరావు, గణపతి, దాదారావు, పాండ్‌రంగ్‌, తుకారాం తదితరులు పాల్గొన్నారు.


logo