గురువారం 02 ఏప్రిల్ 2020
Adilabad - Jan 12, 2020 , 01:44:38

సప్తవర్ణ శోభితం

సప్తవర్ణ శోభితం
  • -నమస్తే తెలంగాణ ఆధ్వర్యంలో అట్టహాసంగా ముగ్గుల పోటీలు
  • -నిర్మల్‌, భైంసాలో పోటీల నిర్వహణ
  • -వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన మహిళలు, యువతులు
  • -ఆకట్టుకున్న ముత్యాల ముగ్గులు
  • -నిర్మల్‌లో తిలకించిన మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి,
  • -విజేతలకు బహుమతుల ప్రదానం చేసిన మంత్రి

నమస్తే తెలంగాణ బృందం : జిల్లా కేంద్రంతోపాటు భైంసాలో ‘నమస్తే తెలంగాణ’ ఆధ్వర్యంలో శనివారం ముగ్గులు పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు వందలాది మంది మహిళలు తరలివచ్చి పోటీల్లో పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని మల్లన్న గుట్టపై గల అయ్యప్ప హరిహర క్షేత్రం, భైంసాలోని గౌతమి ఉన్నత పాఠశాల ఆవరణలో ఈ పోటీలు నిర్వహించారు. పోటీలు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగాయి. సంక్రాంతి పండుగ ప్రాధాన్యతను తెలుపుతూ వేసిన అందమైన ముగ్గులు ఆకట్టుకున్నాయి. ముగ్గులను పరిశీలించిన న్యాయ నిర్ణేతలు ఉత్తమ ముగ్గులను ఎంపిక చేశారు. ఎంపిక కమిటీలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి సతీమణి విజయలక్ష్మి, అయ్యప్ప ఆలయ ధర్మకర్త మురళీధర్‌రెడ్డి సతీమణి వినోదమ్మ, ఎస్పీ శశిధర్‌రాజు సతీమణి రమాదేవి, కలెక్టర్‌ కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మాధవి ఉన్నారు.

పండుగలు ప్రజల ఆచారాలను తెలుపుతాయి

పండుగలు ప్రజల ఆచారవ్యవహారాలను తెలుపుతాయని, అటువంటి పండుగలో సంక్రాతిపండుగకు ఒక ప్రత్యేకత ఉందని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. హరిహరక్షేత్రం వద్ద నమస్తే తెలంగాణ, సాయి దీక్షా సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో.. మహిళలు వేసిన ముగ్గులను మంత్రి పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో సాయిదీక్షసేవాసమితి అధ్యక్షుడు లక్కడి జగన్మోహన్‌రెడ్డి, అయ్యప్ప ఆలయ ధర్మకర్త మురళీధర్‌ రెడ్డి, టీఆర్‌ఎస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు పాకాల రాంచందర్‌, నమస్తే తెలంగాణ బ్యూరో ఇన్‌చార్జి చిన్నారెడ్డి, నిర్మల్‌ డెస్క్‌ ఇన్‌చార్జి విజయ్‌కుమార్‌,టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు మల్లికార్జున్‌రెడ్డి, గొరిగొప్పుల నర్సయ్య, వ్యాఖ్యాత నాగరాజు,అయ్యప్ప ఆలయ గురుస్వామి నవయుగమూర్తి,కోశాధికారి వేణుగోపాల్‌రెడ్డి, పాత్రికేయులు నరేందర్‌, రామేశ్వర్‌, చంద్రశేఖర్‌, తిరుపతిరెడ్డి,ప్రసాద్‌,కొప్పుల రాజేందర్‌, ప్రకటనల విభాగం ఇన్‌చార్జి ప్రవీణ్‌, రవికుమార్‌,సర్క్యులేషన్‌ ఇన్‌చార్జి రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

భైంసాలో..

భైంసాలోని గౌతమి మోడల్‌ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో నమస్తే తెలంగాణ, గౌతమి ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. మొత్తం 70 మంది మహిళలు, యువతులు పాల్గొని ముగ్గులు వేశారు. విజేతలకు నగదు బహుమతితో పాటు పాల్గొన్న వారికి ప్రోత్సహక బహుమతులను అందించారు. న్యాయ నిర్ణేతలుగా భార్గవి వ్యవహరించారు. ముగ్గుల పోటీలు అభినందనీయం: బాశెట్టి సాగరబాయి, జడ్పీ వైస్‌చైర్‌పర్సన్‌మన సంస్కృతి, సంప్రదాయాలను ముందు తరాలకు తెలియజేసేందుకు ముగ్గుల పోటీలు నమస్తే తెలంగాణ దిన పత్రిక నిర్వహించడం అభినందనీయమన్నారు. పోటీల ద్వారా మహిళలో ఉన్న నైపుణ్యం వెలుగులోకి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రుక్మిణిబాయి, డాక్టర్‌ కాశీనాథ్‌, ఏరియా దవాఖాన సూపరింటెండెంట్‌, గౌతమి పాఠశాల కరస్పాండెంట్‌ రాందాస్‌ అన్నారు. మహిళలు ఉత్సాహంగా  పాల్గొనడం మొదటి సారి కనిపిస్తుందని వంటింటికే పరిమితం కాకుండా మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని ఇటువంటి పోటీలు ఎంతో చైతన్యం కలిగిస్తాయని అన్నారు. మహిళలు ఇష్టపడి చేసే పనులలో ముగ్గులు ఒకటి కేవలం బహుమతుల కోసమేగాకుండా తమ ఆత్మగౌరవాన్ని చాటి చెప్పేందుకు మహిళలు ఇంత పెద్ద మొత్తంలో పాల్గొనడం సంతోషంగా ఉంది.

విజేతలకు బహుమతులు

నమస్తే తెలంగాణ ముగ్గుల పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి గౌతమి పాఠశాల కరస్పాండెంట్‌ రాందాస్‌, మేనేజ్‌మెంట్‌ బాలాజీ, జడ్పి వైస్‌చైర్మన్‌ సాగరబాయి, మార్కెట్‌ చైర్మన్‌ రుక్మిణిబాయి బహుమతులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో న్యాయనిర్ణేత భార్గవి, వైద్యులు డా. కాశీనాథ్‌, డా. విజయానంద్‌, డా. ముత్యంరెడ్డి, కుంట రాజలింగు, హల్ద రాజలింగు, భోజరాం, సోలంకిభీంరావు, సాంవ్లీ రమేశ్‌, పండిత్‌రావు, దేవిదాస్‌, నమస్తే తెలంగాణ సబ్‌ ఎడిటర్‌ లింబాద్రి, ముథోల్‌ ఆర్సీ ఇన్‌చార్జి ఎన్‌. కృష్ణ, భైంసారూరల్‌ రిపోర్టర్‌ సంతోశ్‌ పాల్గొన్నారు.


logo
>>>>>>