బుధవారం 08 ఏప్రిల్ 2020
Adilabad - Jan 09, 2020 , 17:37:03

భీంపూర్‌ పీహెచ్‌సీ సూపర్‌వైజర్‌ ఆత్మహత్యాయత్నం

భీంపూర్‌ పీహెచ్‌సీ సూపర్‌వైజర్‌ ఆత్మహత్యాయత్నం

ఎదులాపురం : భీంపూర్‌ మెడికల్‌ అధికారి వేధింపులు భరించలేక అదే పీహెచ్‌సీకి చెందిన సూపర్‌వైజర్‌ లూసి పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన సంఘటన బుధవారం జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్‌వో కార్యాలయం ఎదుట చోటుచేసుకున్నది. భీంపూర్‌ పీహెచ్‌సీ ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు డీఎంహెచ్‌వో కార్యాలయానికి చేరుకున్నారు. లైంగికంగా, మానసింగా వేధింపులకు గురిచేస్తున్న మెడికల్‌ ఆఫీసర్‌ సూరత్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. అనంతరం డీఎంహెచ్‌వోకు లీఖితపూర్వకంగా ఫిర్యాదుచేశారు. కొన్ని రోజులుగా మెడికల్‌ అధికారి గిరిగామ్‌ సబ్‌సెంటర్‌లో పనిచేస్తున్న ముగ్గురు ఆశ కార్యకర్తలతోపాటు సూపర్‌వైజర్‌ లూసిని వేధింపులకు గురిచేస్తున్నాడని ఆరోపించారు. వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆందోళన చేస్తున్న వారికి ఆదివాసీ సంఘ నాయకులు మద్దతు పలికారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ.. వెంధిపులకు గురిచేస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదుపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు.


logo