మంగళవారం 31 మార్చి 2020
Adilabad - Jan 09, 2020 , 17:36:17

పల్లె ప్రగతికి సహకరించాలి

పల్లె ప్రగతికి సహకరించాలి

బోథ్‌, నమస్తే తెలంగాణ: గ్రామాల్లో పారిశుద్ధ్య పనులకు సహకారం అందించాలని జాయింట్‌ కలెక్టర్‌ సంధ్యారాణి సూచించారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా జేసీ బుధవారం బోథ్‌ మండలంలోని సొనాల గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలోని వార్డులను కలియతిరిగారు. గ్రామ పంచాయతీలో వార్డు సభ్యులు, గ్రామస్తులతో మాట్లాడారు. డంపింగ్‌ యార్డు నిర్మాణ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ... ఇండ్లలో సేకరించిన చెత్తను చెత్త బుట్టల్లో వేసి ఉంచాలన్నారు. కాలనీలకు వచ్చే పారిశుద్ధ్య కార్మికులకు అందిస్తే వారు డంపింగ్‌ యార్డుకు చేరవేస్తారన్నారు. సొనాల బస్టాండ్‌లో మహనీయుల విగ్రహాల చుట్టూ ఆహ్లాదకర వాతావరణం కనిపించేందుకు వీలుగా గార్డెనింగ్‌ ఏర్పాటుచేయించాలని సంబంధిత అధికారులకు సూచించారు. జేసీ వెంట బోథ్‌ ఎంపీపీ తుల శ్రీనివాస్‌, జడ్పీటీసీ డాక్టర్‌ సంధ్యారాణి, మండల ప్రత్యేకాధికారి పుల్లారావు, సర్పంచ్‌ సదానందం, ఉప సర్పంచ్‌ రామాయి గంగామణి, గ్రామ ప్రత్యేకాధికారి వెండి విశ్వామిత్ర, కార్యదర్శి గంగాసాగర్‌, వార్డు సభ్యులు, గ్రామస్తులు ఉన్నారు.


గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలి : జడ్పీ సీఈవో
జైనథ్‌ : పల్లె ప్రగతి పనుల్లో పాల్గొనడం ద్వారా గ్రామాల అభివృద్ధికి ప్రజలు తోడ్పాటునందించాలని జైనథ్‌ మండల ప్రత్యేకాధికారి, జడ్పీ సీఈవో కిషన్‌ అన్నారు. బుధవారం మండలంలోని బెల్లూరి, బెల్గాం గ్రామాల్లో ప్రత్యేకాధికారి కిషన్‌ పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో కలియ తిరుగుతూ రోడ్లు, మురికి కాల్వలను, పౌర సరఫరాల బోర్డును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పల్లెలు బాగుపడాలంటే ప్రజలు సహకరించాలన్నారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతను పాటించాలన్నారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా డంపింగ్‌యార్డుకు చేరవేయాలన్నారు. డంపింగ్‌యార్డుతోపాటు శ్మశాన వాటికను హరితహారం నర్సరీలో విధిగా ప్రజలకు అవసరమైన మొక్కలనే పెంచాలన్నారు. దాతల నుంచి విరాళాలు సేకరించి గ్రామాభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలని సూచించారు. ప్రత్యేకాధికారి వెంట ఎంపీడీవో గజానన్‌రావు, ఏపీవో జగ్గేరావు, ఎంపీటీసీ రాంరెడ్డి, స్పెషల్‌ ఆఫీసర్‌ రాజ్‌కిరణ్‌, పంచాయతీ కార్యదర్శి మల్లేశ్‌ తదితరులు ఉన్నారు.


logo
>>>>>>