సోమవారం 30 మార్చి 2020
Adilabad - Jan 09, 2020 , 17:35:25

తొలి రోజు 17 నామినేషన్లు

తొలి రోజు 17 నామినేషన్లు

నామినేషన్ల స్వీకరణకు టీటీడీసీలో రెండు భవనాల ఏర్పాటు
-ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్‌ దివ్య
-నేడు భారీగా దాఖలయ్యే అవకాశాలు
ఆదిలాబాద్‌, నమస్తే తెలంగాణ ప్రతినిధి:ఆదిలాబాద్‌ మున్సిపాలిటీకి త్వరలో జరిగే పోలింగ్‌కు బుధవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. మున్సిపల్‌ పరిధిలో 49 వార్డులు ఉండగా పాలిటెక్నిక్‌ కళాశాల సమీపంలోని టీటీడీసీలో అధికారులు నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు చేశారు. రెండు భవనాల్లో అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు అవకాశం కల్పించారు. మొదటి భవనంలో 1 నుంచి 24 వార్డులు, రెండో భవనంలో 25 నుంచి 49 వార్డులకు అభ్యర్థులు నామినేషన్లు వేసేలా ఏర్పాట్లు చేశారు. ప్రతి మూడు వార్డులకు ఒక రిటర్నింగ్‌ అధికారిని నియమించారు. 49 వార్డులకు గానూ 16 మంది రిటర్నింగ్‌ అధికారులు నామినేషన్లు స్వీకరిస్తుండగా వారికి సహాయకులను నియమించారు. భవనాల ముందు వార్డుల వారీగా రిజర్వేషన్లు, రిటర్నింగ్‌ అధికారుల వివరాలను తెలియజేసేలా బోర్డులు ఏర్పాటు చేశారు. మూడ్రోజుల పాటు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని, ఇందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్ల కలెక్టర్‌ తెలిపారు. అభ్యర్థులు అన్ని వివరాలతో నామినేషన్లు దాఖలు చేయాలన్నారు. టీటీడీసీ ఆవరణలో పోలీసు బందోబస్తుతో పాటు రెండు భవనాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.


తొలిరోజు 17 నామినేషన్లు
మొదటి రోజు బుధవారం 17 నామినేషన్లు దాఖలయ్యాయి. వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్‌లు నామినేషన్లు వేశారు. టీఆర్‌ఎస్‌ తరఫున 10, బీజేపీ నుంచి 4, సీపీఐ, కాంగ్రెస్‌, ఇండిపెండెంట్‌ అభ్యర్థులు ఒక్కో నామినేషన్‌ వేశారు. టీఆర్‌ఎస్‌ నుంచి 1, 2, 3, 5, 21, 34, 42, 44, 32 ,46 వార్డులకు, బీజేపీ నుంచి 27,40,46,49 వార్డులకు, కాంగ్రెస్‌ నుంచి 26, సీపీఐ నుంచి 10 వార్డు, 29 వార్డు నుంచి ఇండిపెండెంట్‌ నామినేషన్‌ వేశారు.


logo