e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home ఆదిలాబాద్ అనుమతుల్లేకుంటే రానివ్వద్దు ..

అనుమతుల్లేకుంటే రానివ్వద్దు ..

అనుమతుల్లేకుంటే రానివ్వద్దు ..

మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి
జంగాం సమీపంలోని చెక్‌పోస్టు పరిశీలన

జైనూర్‌, మే 17 : కరోనా వ్యాప్తి నియంత్రణ కు ప్రత్యేక చర్యలు తీసుకుంటూ, ఇతర రాష్ర్టా ల నుంచి అనుమతి లేకుండా వచ్చే ప్రజలను రాని వ్వద్దని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి సూచిం చారు. సోమవారం మండలంలోని జంగాం గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా చెక్‌పోస్ట్‌ను ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజురోజుకూ కరోనా కేసు లు పెరుగుతున్న దృష్ట్యా ప్రభుత్వం లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నదని తెలిపారు. ప్రతి ఒక్కరూ లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించేలా చూడాలని సూచించారు. అనంతరం మండల కేంద్రంలో రాష్ట్ర హజ్‌ కమిటీ సభ్యుడు ఇంతియాజ్‌లాలను పరామర్శించారు. ఇటీవల ఇంతియాజ్‌లాల తండ్రి మృతి చెందాడు. మంత్రి ఇంతియాజ్‌లా లను పరామర్శించి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. మంత్రి వెంట జిల్లా పరిషత్‌ కోఆప్షన్‌ సభ్యుడు సయ్యద్‌ అబుతా లిబ్‌, మండల పరిషత్‌ ఉపాధ్యక్షుడు చిర్లె లక్ష్మణ్‌, మెస్రం అంబాజీ, సర్పంచ్‌ కుంర శ్యాంరావ్‌ తదితరులున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అనుమతుల్లేకుంటే రానివ్వద్దు ..

ట్రెండింగ్‌

Advertisement