e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 25, 2021
Home ఆదిలాబాద్ లాక్‌డౌన్‌తో కరోనా తగ్గుముఖం

లాక్‌డౌన్‌తో కరోనా తగ్గుముఖం

లాక్‌డౌన్‌తో కరోనా తగ్గుముఖం

దేశవ్యాప్తంగా అమలు చేయాలని సూచించారు..
చివరి దశలో సర్కారు దవాఖానకు వచ్చి ప్రాణాలు వదులుతున్న పేషెంట్లు
ఈనెల 30లోగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలి..
అటవీ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
కరోనా, ధాన్యం కొనుగోళ్లపై మంచిర్యాల జిల్లా అధికారులతో సమీక్ష
రామకృష్ణాపూర్‌ ఏరియా దవాఖానను విప్‌ సుమన్‌తో కలిసి సందర్శన

సీసీసీ నస్పూర్‌, మే 16 :‘సర్కారు పకడ్బందీగా అమలు చేస్తున్న లాక్‌డౌన్‌తో కరోనా పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పడుతున్నాయని, జ్వర సర్వే కూడా మంచి ఫలితాలు ఇస్తున్నదని, ప్రదాని మోదీ కూడా మెచ్చుకుని పలు రాష్ర్టాలు అమలు చేయాలని సూచించారని’ అటవీ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన విప్‌ సుమన్‌తో కలిసి మంచిర్యాల జిల్లాలో పర్యటించారు. సీసీసీ సింగరేణి అతిథి గృహంలోని సమావేశ మందిరంలో ప్రభుత్వ, సింగరేణి అధికారులతో కరోనాపై, వ్యవసాయ అధికారులతో ధాన్యం కొనుగోళ్లపై సమీక్షించారు. అనంతరం రామకృష్ణాపూర్‌ ఏరియా దవాఖానను సందర్శించి సమీక్ష నిర్వహించారు.

కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించిందని, దీనిద్వారా కేసులు తగ్గుముఖం పట్టాయని రాష్ట్ర అటవీ, దేవాదాయ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మంచిర్యాల జిల్లా సీసీసీ సింగరేణి అతిథి గృహంలోని సమావేశ మందిరంలో ఎమ్మెల్యేలు, కలెక్టర్‌, అదనపు కలెక్టర్లు, ప్రభుత్వ, సింగరేణి వైద్య అధికారులు, పోలీస్‌ అధికారులతో ఆదివారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యలు, అందుబాటులో ఉన్న మందు లు, వ్యాక్సినేషన్‌ ప్రక్రి య, ఆక్సిజన్‌, రెమిడెసివర్‌ ఇంజక్షన్లు, ఫీవర్‌ సర్వే, కరోనా టెస్టుల వివరాలు, బెల్లంపల్లి, మం చిర్యాల, రామకృష్ణాపూర్‌ సింగరేణి ఏరియా దవాఖానల్లోని ఐసోలేషన్‌ కేంద్రా ల్లో రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలు, రోగుల స్థితిగతులను కలెక్టర్‌, వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ కొవిడ్‌ నిర్మూలనకు చేపట్టిన ఇంటింటా జ్వర సర్వేను ప్రధానమంత్రి సైతం మెచ్చుకున్నారని, దేశవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించరన్నారు. జిల్లాలో 800పైగా బెడ్లు అందుబాటులో ఉన్నాయని, ప్రైవేట్‌ దవాఖానల నిర్వాహకులు మానవతాదృక్పథంతో ఆలోచించి నిరుపేద రోగు ల వద్ద ఫీజులు తక్కువగా తీసుకోవాలని కోరారు. బెల్లంపల్లి ఐసోలేషన్‌ కేంద్రంలో ఆక్సిజన్‌ అందక ఎనిమిది మంది మృతి చెందారనే ప్రచారం తన ను కలిచివేసిందని, దీనిపై పూర్తి వివరాలు తెలుసుకోగా వారంతా చివరి స్టేజీలో దవాఖానకు వచ్చి చనిపోయినట్లు విచారణలో వెల్లడైందన్నా రు. ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ మాట్లాడుతూ కరోనా రోగుల నుంచి కొందరు అంబులెన్స్‌ డ్రైవ ర్లు అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని, వీరి ఆగడాలకు అధికారులు అడ్డుకట్ట వేయాలని సూచించారు.

అలాగే కొన్ని ప్రైవేట్‌ దవాఖాన నిర్వాహకులు కొవిడ్‌ రోగులకు చివరి వరకు వైద్యం అందించి సీరియస్‌ అయిన తర్వాత రెఫర్‌ చేయడంతో వారు ప్రభుత్వ ఐసోలేషన్‌కు వస్తున్నారని, ముందే పంపిస్తే రోగి ప్రాణాపాయం కాపాడే అవకాశం ఉంటుందన్నారు. సర్కారు దవాఖానల్లో టెస్టులు, వ్యాక్సినేషన్‌ ఒకే చోట జరుగుతుండడంతో ప్రజలు భ యాందోళనకు గురువుతున్నారని, వైద్యులు తగు చర్యలు చేపట్టాలని సూచించారు. పీహెచ్‌సీలో ఎక్కువ సంఖ్యలో ఆక్సి మీటర్లు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. రామకృష్ణాపూర్‌ సింగరేణి ఏరియా దవాఖానలో సరిపడా సిబ్బంది నియామకానికి యాజమాన్యం చర్యలు తీసుకోవాలని కోరారు. అక్సిజన్‌ ప్లాంట్‌, సిటీ స్కానింగ్‌ ఏర్పాటుతో ఇబ్బందుల్లేకుండా అయ్యిందన్నారు. అనంతరం మంచిర్యా ల కలెక్టర్‌ భారతీ హోళికేరి మాట్లాడుతూ జిల్లాలో కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతిరోజు దాదాపు 1300లకు పైగా టెస్టులు చేస్తే 24శాతం వరకు పాజిటివ్‌ వస్తున్నాయని చెప్పారు. ఇంటింటా జ్వర సర్వేలో లక్షణా లు ఉన్న వారికి అక్కడికక్కడే మందులు ఇస్తున్నామని, మళ్లీ నాలుగు రోజుల పరీక్షించి లక్షణాలు తగ్గకుంటే మెరుగైన వైద్యం అందించేందుకు దవాఖానకు తరలిస్తున్నామన్నారు. కొవిడ్‌ రోగుల కోసం కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేసి సమాచారం అందిస్తున్నామన్నారు.

బెల్లంపల్లి ఏరియా దవాఖానకు పూర్తిగా కొవిడ్‌ హాస్పిటల్‌గా మార్చి అక్సిజన్‌, రెమిడెసివర్‌ ఇంజక్షన్లు, తదితర మందులన్నీ అందుబాటులో ఉంచామని చెప్పారు. కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలని మంచిర్యాల జడ్పీ చైర్‌పర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మి అన్నారు. ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని అర్హులందరూ వ్యాక్సిన్‌ వేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్క రూ కొవిడ్‌ నిబంధనలు పాటించి ప్రభుత్వానికి సహకారం అందించాలన్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు మాట్లాడుతూ మంచిర్యాల మున్సిపాలిటీలో మూడు అంబులెన్స్‌లు ఏర్పాటు చేసి కొవిడ్‌ రోగులకు ఉచితంగా సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. అంతేగాకుండా అన్ని మున్సిపాలిటీల్లో సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని నిరంతరం పిచికారీ చేస్తున్నామన్నారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ బెల్లంపల్లి ఐసోలేషన్‌ కేంద్రంలోని మూడు అంబులెన్స్‌లు రిపేర్‌కు వచ్చాయన్నారు. దీంతో కరోనా మృతదేహాల తరలింపులో జాప్యం జరుగుతుందని, అంబులెన్స్‌ల ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఇక్కడి కొవి డ్‌ సెంటర్‌లో సింగరేణి యాజమాన్యం సిటీ స్కానింగ్‌ సెంటర్‌ చేయాలని కోరారు. సింగరేణి డైరెక్టర్‌ (ఫైనాన్స్‌, పీపీ) బలరాం మాట్లాడారు.

సింగరేణి కార్మికులు, వారి కుటుంబసభ్యులు, మాజీ కార్మికుల కుటుంబాలకు మెరుగైన కొవిడ్‌ వైద్యం అందిస్తున్నామని తెలిపారు. రామకృష్ణాపూర్‌ సింగరేణి ఏరియా దవాఖానలో రెమిడెసివర్‌ ఇంజక్షన్లు, అక్సిజన్‌, మందుల కొరత లేకుం డా చూస్తున్నామని చెప్పారు. త్వరలోనే అక్సిజన్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య విన్నపం మేరకు బెల్లంపల్లిలో సిటి స్కానింగ్‌ కోసం సీఎండీకి దృష్టికి తీసుకెళ్లి ఏర్పాటు చేసేలా కృషి చేస్తానని డైరెక్టర్‌ హామీ ఇచ్చారు. జిల్లాలో లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేస్తున్నామని మంచిర్యాల డీసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 10 పోలీస్‌ చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేశామన్నారు. మహారాష్ట్ర సరిహద్దు కోటపల్లి మండ లం రాపన్‌పల్లి వద్ద అంతర్రాష్ట్ర బ్రిడ్జి వద్ద చెక్‌పోస్టు ఏర్పాటు చేసి క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతున్నామన్నారు. ఇప్ప టి వరకు జిల్లాలో 4వేలకు పైగా కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. పోలీస్‌ సిబ్బందికి వ్యాక్సిన్‌ పంపిణీ పూర్తి చేశామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఇలా త్రిపాఠి, మధుసూదన్‌ నాయక్‌, ఏసీపీ అఖిల్‌ మహాజన్‌, ఏరియా దవాఖాన సూపరింటెండెండ్‌ అరవింద్‌, శ్రీరాంపూర్‌, మందమర్రి జీఎంలు సురేశ్‌, చింతల శ్రీనివాస్‌, వైద్య శాఖ అధికారులు పాల్గొన్నారు.
30లోగా కొనుగోళ్లు పూర్తి చేయాలి : మంత్రి
జిల్లాలో ఈనెల 30లోగా ధాన్యం కొనుగోళ్లను పూర్తి చేయాలని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సీసీసీ సింగరేణి అతిథి గృహంలోని సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. రైస్‌ మిల్లులు, ధా న్యం సేకరణ, సమస్యలను అధికారులను అడిగితెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 96వేల మె ట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, మిగిలిన ధాన్యాన్ని 30లోగా కొనుగోలు చేసి వెంటవెంటనే రైస్‌మిల్లులకు తరలించాలని సూచించారు. వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
లాక్‌డౌన్‌ అమలు తీరు పరిశీలన
మంచిర్యాలటౌన్‌, మే 16: మంత్రి అల్లోల విప్‌ బాల్క సుమన్‌, ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్యతో కలిసి జిల్లాకేంద్రంలో లాక్‌డౌన్‌ అమలు తీరును పరిశీలించారు. బెల్లంపల్లి చౌరస్తాలో మెడికల్‌ షాపు నిర్వాహకురాలతో మంత్రి మాట్లాడారు. ఎలాంటి మందుల కోసం రోగులు వస్తున్నారని, రెమిడెసివర్‌ మందు దొరుకుతుందా..? అని అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్‌ చైర్మన్‌ పెంట రాజయ్య, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పల్లె భూమేశ్‌, టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు గాదె సత్యం, యూత్‌ నాయకులు గోగుల రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
లాక్‌డౌన్‌తో కరోనా తగ్గుముఖం

ట్రెండింగ్‌

Advertisement