e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 25, 2021
Home ఆదిలాబాద్ పజలకు టీఆర్‌ఎస్‌ అండ

పజలకు టీఆర్‌ఎస్‌ అండ

పజలకు టీఆర్‌ఎస్‌ అండ

మావల జడ్పీటీసీ నల్ల వనిత
ఇంటింటికీ కూరగాయలు పంపిణీ

ఆదిలాబాద్‌ రూరల్‌, మే 16: ప్రజలకు టీఆర్‌ఎస్‌ పార్టీ అండగా ఉంటుందని మావల జడ్పీటీసీ నల్ల వనిత పేర్కొన్నారు. మావలలో జడ్పీటీసీ వనిత, సర్పంచ్‌ ప్రమీల ఆధ్వర్యంలో నాయకులు ఆదివారం ఇంటింటికీ తిరుగుతూ కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా విజృంభిస్తున్నందున ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మాస్కు ధరించడంతో పాటు భౌతికదూరం పాటించాలని సూచించారు. లాక్‌డౌన్‌ అమలులో ఉన్న నేపథ్యంలో ప్రజలు బయటకు రావద్దన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ మహేందర్‌ యాదవ్‌, నాయకులు నల్ల రాజేశ్వర్‌, దొగ్గలి రాజేశ్వర్‌, గంగుల కిరణ్‌, సుధీర్‌, అభిమాన్‌, గంగన్న, గంగాధర్‌, మోహన్‌, రాజు, రాకేశ్‌, సంతోష్‌ పాల్గొన్నారు.
తాగునీరు, జ్యూస్‌ పంపిణీ
జిల్లా కేంద్రంలో పోలీసులు ఎండను సైతం లెక్క చేయకుండా లాక్‌డౌన్‌ పకడ్బందీగా అమలు చేస్తుండడంతో వారికి తెలంగాణ జాగృతి జైనథ్‌ మండల శాఖ ఆధ్వర్యంలో తాగునీరు, జ్యూస్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి జైనథ్‌ మండలాధ్యక్షుడు ప్రవీణ్‌ మాట్లాడుతూ లాక్‌డౌన్‌లో ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ ప్రజల ప్రాణాలను రక్షిస్తున్నారన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు విధులు నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు అరిగెల శ్రీకాంత్‌, నాయకులు తార కార్తిక్‌, తదితరులు పాల్గొన్నారు.
వలస కూలీలకు అన్నదానం
ఆదిలాబాద్‌ టౌన్‌, మే 16: పట్టణంలోని నేతాజీచౌక్‌లో ఏవీకే ఫౌండేషన్‌, స్వీకృతి డ్యాన్స్‌ అకాడమీ, సంగం చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో వలస కూలీలకు అన్నదానం చేశారు. దుర్గం ట్రస్ట్‌ చైర్మన్‌ శేఖర్‌ ముఖ్య అతిథిగా హాజరై వడ్డన చేశారు. ఈ సందర్భంగా సంస్థ నిర్వాహకుడు సంగెం సుధీర్‌కుమార్‌ మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో తాము ప్రతి ఆదివారం అన్నదానం చేపడుతున్నామని ఇది ఆరో వారమని తెలిపారు. కార్యక్రమంలో రాచర్ల మహేశ్‌, నవీన్‌వర్మ, ప్రవీణ్‌గౌడ్‌, అశోక్‌, తదితరులు పాల్గొన్నారు.
ఆహార ప్యాకెట్లు అందజేత
జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్‌, బస్టాండు, రిమ్స్‌ పరిసరాలు, రోడ్లపై నిస్సహాయంగా 200 మంది యాచకులకు బెస్ట్‌ఫ్రెండ్స్‌ హెల్ప్‌ వెల్ఫేర్‌ సొసైటీ సభ్యులు ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు అబ్దుల్‌ అజీజ్‌, సభ్యులు శ్రీకాంత్‌, ఆసిఫ్‌, తదితరులున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పజలకు టీఆర్‌ఎస్‌ అండ

ట్రెండింగ్‌

Advertisement