e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 22, 2021
Home ఆదిలాబాద్ అధునాతన టెక్నాలజీతో నేరాల అదుపు

అధునాతన టెక్నాలజీతో నేరాల అదుపు

ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న
రూ.2కోట్లతో చేపట్టనున్న కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ నిర్మాణానికి భూమిపూజ
హాజరైన కలెక్టర్‌,ఎస్పీ

ఎదులాపురం, సెప్టెంబర్‌ 15 : తెలంగాణ రాష్ట్రంలో అధునాతన టెక్నాలజీతో పోలీస్‌ వ్యవ స్థ పటిష్టం అవ్వడంతోపాటు నేరాల శాతం తగ్గు ముఖం పడుతున్నదని ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. అదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని కైలాస్‌నగర్‌లో పట్టణ ప్రగతిలో భాగంగా రూ.2కోట్లతో చేపట్టనున్న పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ నిర్మాణ పనులకు జిల్లా కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌, ఇన్‌చార్జి ఎస్పీ రాజేశ్‌ చంద్రతో కలిసి ఎమ్మెల్యే భూమి పూజ చేసి శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డాక సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర రాజ ధాని హైదరాబాద్‌లో రూ.400కోట్లతో ఆధునా తనమైన టెక్నాలజీతో పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. ఇది భారతదేశంలోనే కాకుండా ఆసియా ఖండంలోనే అతిపెద్ద పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ అని చెప్పారు. అదే విధంగా ఆదిలాబాద్‌లో సైతం మున్సిపల్‌ నిధులు రూ.2 కోట్లతో ఈ కంట్రోల్‌రూమ్‌ ఏర్పా టు చేస్తున్నామని తెలిపారు. దీనితోపాటు మరో రూ.20 లక్షలతో భవన నిర్మాణం సైతం చేపట్టను న్నట్లు తెలిపారు. ఈ నూతన కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటుతో నిఘా వ్యవస్థ మరింత పటిష్టం కానుందన్నారు. ఇప్పటికే ఆదిలాబాద్‌ పట్టణంలో 130 సీసీ కెమెరాలు ఉండగా, మరో 420 సీసీ కెమెరాల ఏర్పాటుతోనే నేరాలు అదుపు చేయ వచ్చని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కోటి మందికి వ్యాక్సిన్‌ అందించే కార్యక్రమాన్ని మళ్లీ వేగవం తం చేస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ తీసు కోని కొవిడ్‌ వైరస్‌ బారినపడకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు, మున్సి పల్‌ కమిషనర్‌ శైలజ, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మెట్టు ప్రహ్లాద్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ జీహీర్‌ రంజానీ, ఫ్లోర్‌ లీడర్‌ సతీశ్‌, వార్డు కౌన్సిలర్‌ అర్చనా రామ్‌ కుమార్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు , పోలీస్‌లు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana