e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 20, 2021
Home ఆదిలాబాద్ నవరాత్రులను ప్రశాంతంగా జరుపుకోవాలి

నవరాత్రులను ప్రశాంతంగా జరుపుకోవాలి

జిల్లాలో డీజేలకు అనుమతి లేదు
నిర్మల్‌ ఇన్‌చార్జి ఎస్పీ ప్రవీణ్‌

నిర్మల్‌ అర్బన్‌, సెప్టెంబర్‌ 13 : జిల్లాలో నవరాత్రులను ప్రశాంతంగా జరుపుకోవాలని ఇన్‌చార్జి ఎస్పీ ప్రవీణ్‌ కుమార్‌ అన్నారు. పట్టణంలోని ఎంఎస్‌ ఫంక్షన్‌ హాల్‌లో గణేశ్‌ మండపాల నిర్వాహకులు, ఉత్సవ సమితి, సంబంధిత శాఖల అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మం డపాల కొవిడ్‌ నిబంధనలు పాటించేలా చూడాలన్నారు. యువజన సంఘాల సభ్యులు మండపా ల వద్ద ఉంటూ పోలీసులకు సహకరించాలని కో రారు. డీజేల వాడకాన్ని నిషేధించామని చెప్పారు. విగ్రహాలను నిమజ్జనం చేసే చెరువుల వద్ద వి ద్యుత్‌, తదితర ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అదనపు ఎస్పీ రాంరెడ్డి, డీఎస్పీ ఉపేందర్‌ రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ ఈశ్వర్‌, పట్టణ సీఐ శ్రీనివాస్‌, మండపాల సభ్యులు, ఉత్స వ కమిటీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.
పోలీసుల కవాతు
ముథోల్‌, సెప్టెంబర్‌, 13 : మండలకేంద్రంలో భైంసా ఏఎస్పీ కిరణ్‌ ఖారే పోలీసుల కవాతులో సోమవారం సాయంత్రం పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిమజ్జన ఏర్పాట్ల వివరాలను స్థానిక సీఐ వినోద్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సర్పంచ్‌ రాజేందర్‌కు సూచనలు, సలహాలు చేశారు. అనుమానితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. శాంతియుతంగా ఉత్సవాలను జరుపుకోవాలని సూచించారు. ఈయన వెంట ఎస్‌ఐ అశోక్‌, పీఎస్‌ఐ సా యికృష్ణ, పోలీసు బలగాలు ఉన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana