e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 24, 2021
Home ఆదిలాబాద్ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి

ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌
పెంబి ఆశ్రమ పాఠశాలలో అదనపు గదుల నిర్మాణానికి భూమిపూజ

పెంబి, జూన్‌ 13: ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని వసతులతో పాటు మెరుగైన విద్యను ప్రభుత్వం అందిస్తున్నదని ఖానాపూర్‌ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్‌ పేర్కొన్నారు. మండల కేం ద్రంలోని ఆశ్రమ పాఠశాలలో ఐటీడీఏ ద్వారా మంజూరైన రూ.40 లక్షలతో అదనపు గదుల నిర్మాణానికి ఆదివారం ఆమె భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. అనంతరం మండల కేంద్రానికి చెందిన రమేశ్‌కు రూ. 60 వేలు, నర్సవ్వకు రూ. 12 వేలు, నాగాపూర్‌ గ్రామానికి చెంది న సుమతికి రూ. 13,500, అంజలికి రూ. 11, 500 సీఎంఆర్‌ఎఫ్‌ కింద మంజూరైన చెక్కులు అందజేశారు.
పోడు భూముల పరిష్కారానికి సుముఖం
రాష్ట్రంలోని పోడు భూముల సమస్యలు పరిష్కరించడానికి సీఎం కేసీఆర్‌ సముఖంగా ఉన్నాడని ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్‌ అన్నారు. మండల కేంద్రం, లక్ష్మీపూర్‌ గ్రామాల్లో కొన్ని సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న పోడు భూముల్లో అట వీ శాఖ అధికారులు ప్లాంటేషన్‌ చేయడానికి ప్ర యత్నిస్తున్నారని, దానిని నిలిపివేయాలని రైతులు ఆమెకు వినతిపత్రం ఇచ్చారు. ఆమె వెంటనే అటవీ శాఖ ఉన్నత అధికారులకు ఫోన్‌ చేసి 30 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న పోడు భూముల్లో ప్లాంటేషన్‌ చేయవద్దని అధికారులను ఆదేశించారు. అధికారులు సానుకూలంగా స్పందించారని, ప్లాంటేషన్‌ చేయమని తెలిపారన్నారు. రైతులు పోడు భూముల్లో పంటలు సాగు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గంగనర్సయ్య, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు పుప్పాల శంకర్‌, రైతు బంధు సమితి మండల కన్వీనర్‌ గోవింద్‌, వైస్‌ఎంపీపీ బైరెడ్డి గంగారెడ్డి, సర్పంచ్‌లు పూర్ణచందర్‌ గౌడ్‌, సుధాకర్‌, నాయకులు భూమాగౌడ్‌, బానవత్‌ విలాస్‌, విక్రమ్‌నాయక్‌, గాండ్ల శంకర్‌, ఆత్రం రమేశ్‌, తదితరులు పాల్గొన్నారు.
కోర్టు భవనం పరిశీలన..
ఖానాపూర్‌ టౌన్‌, జూన్‌ 13: పట్టణంలోని విద్యానగర్‌లో నిర్మించిన కోర్టు భవనాన్ని ఎమ్మెల్యే రేఖానాయక్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని వసతులతో ప్రజలు, అధికారులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా భవ నం నిర్మించామని ఈ నెల 16న ప్రారంభిస్తామన్నారు. అంతకుముందు క్యాంపు కార్యాలయంలో మండలంలోని పలు గ్రామాలకు చెందిన 21 మందికి రూ. 5.26 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను ఆమె అందజేశారు. ఆయా కార్యక్రమల్లో మున్సిపల్‌ చైర్మన్‌ అంకం రాజేందర్‌, వైస్‌ చైర్మన్‌ అబ్దుల్‌ ఖలీల్‌, ఏఎంసీ చైర్మన్‌ కడార్ల గంగనర్సయ్య, పట్టణ అధ్యక్షుడు పరిమి సురేశ్‌, ప్రధాన కార్యదర్శ తూము చరణ్‌, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, నాయకులు పాల్గొన్నారు.
పంచాయతీ భవనం ప్రారంభం..
ఖానాపూర్‌ రూరల్‌, జూన్‌ 13 : మండలంలోని ఎర్వచింతల్‌లో ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్‌ సర్పంచ్‌ కొడారి గోపాల్‌తో కలిసి పంచాయతీ భ వనాన్ని ప్రారంభించారు. అనంతరం పలువురికి సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను అందజేశారు. ఎంపీపీ మొహిద్‌, వైస్‌ ఎంపీపీ వాల్‌సింగ్‌, ఉప సర్పం చ్‌ కోండ్రా దేవేందర్‌, ఏఎంసీ కడర్ల గంగానర్స య్య, పీఎసీఎస్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌ రెడ్డి, రామునాయక్‌, కొక్కుల ప్రదీప్‌, నాయకులు పెద్ది నర్స య్య, సాగి లక్ష్మణ్‌రావ్‌, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి

ట్రెండింగ్‌

Advertisement