e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home ఆదిలాబాద్ జొన్న రైతుకు మద్దతు

జొన్న రైతుకు మద్దతు

జొన్న రైతుకు మద్దతు

అన్నదాతకు అండగా నిలుస్తున్న సర్కారు
దళారుల చేతుల్లో మోసపోకుండా చర్యలు
ఆదిలాబాద్‌ జిల్లాలో ప్రారంభమైన కొనుగోళ్లు
తొమ్మిది కేంద్రాల్లో 5.09 లక్షల క్వింటాళ్ల సేకరణకు ఏర్పాట్లు
పారదర్శక కొనుగోళ్లకు క్రాప్‌ బుకింగ్‌ అమలు

ఆదిలాబాద్‌, జూన్‌ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) :ఆరుగాలం శ్రమించి పండించిన జొన్న పంటకు సర్కారు మద్దతు ధర చెల్లిస్తున్నది. కాలం కలిసి రావడం, సర్కారు ప్రోత్సహించడం, ఉచితంగా కరంటు ఇస్తుండడం, పెట్టుబడి సాయం అందిస్తుండడంతో పంట విస్తీర్ణం పెరిగి, దిగుబడి కూడా రికార్డుస్థాయిలో వచ్చింది. దీనిని ఆసరా చేసుకున్న దళారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ రైతులను నట్టేట ముంచుతున్నారు. గమనించిన సర్కారు రైతులు మోసపోకూడదని మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నది. ఆదిలాబాద్‌ జిల్లావ్యాప్తంగా ఐదు కేంద్రాలు ప్రారంభం కాగా.. సోమవారం నుంచి మరో నాలుగు కేంద్రాలు ప్రారంభంకానున్నాయి. 5.09 లక్షల క్వింటాళ్ల పంట ఉత్పత్తులను సేకరించనుండగా.. పారదర్శకత కోసం క్రాప్‌ బుకింగ్‌ను అమలు చేస్తున్నది.

కరోనా సమయంలో రైతులు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నది. రైతులు కష్టపడి పండించిన పంటలు దళారుల పాలు కాకుండా మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నది. ఆదిలాబాద్‌ జిల్లాలో ఇప్పటికే పత్తి, కంది, సోయాబీన్‌, శనగ ఉత్పత్తులను కొనుగోలు చేసిన ప్రభుత్వం కరోనా కారణంగా పల్లెల్లోనే కాంటాలను ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేసింది. ఆదిలాబాద్‌ జిల్లాలో రైతులు యాసంగిలో శనగ, జొన్న, పల్లి సాగు చేస్తారు. ఈ ఏడాది 33,955 ఎకరాల్లో రైతులు జొన్న వేశారు. జిల్లావాసులు జొన్నను ఆహార పంటగా ఉపయోగించడంతోపాటు విక్రయిస్తారు. వాతావరణ పరిస్థితులు, సాగునీరు, 24 గంటల విద్యుత్‌ తో దిగుబడులు బాగా వచ్చాయి. ఎకరాకు 17 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చినట్లు వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. గ్రామాల్లో పంట అధికంగా రావడంతో వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేయడం ప్రారంభించారు. క్వింటాలుకు రూ.1200-రూ.1400 చెల్లిస్తుండడంతో రైతులు నష్టపోయే పరిస్థితి నెలకొంది. అన్నదాతలు అహర్నిశలు కష్టపడి సాగు చేసిన పంటను వ్యాపారులకు తక్కువ ధరకు విక్రయించి నష్టపోకుండా మద్దతు ధరతో క్వింటాలుకు రూ.2,620 చెల్లించి సర్కారు కొనుగోలు చేస్తున్నది.

5,09,307 క్వింటాళ్లు అంచనా..
ఆదిలాబాద్‌ జిల్లాలో ఈ సీజన్‌లో 5,09,307 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేసిన అధికారులు కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని తొమ్మిది మార్కెట్‌యార్డులు ఆదిలాబాద్‌, ఇచ్చోడ, జైనథ్‌, బేల, తాంసి, బోథ్‌, ఇంద్రవెల్లి, హస్నాపూర్‌, ఉట్నూర్‌లోని ప్రాథమిక సహకార సంఘాల ద్వారా జొన్న ఉత్పత్తులను సేకరించనున్నారు. ఇప్పటికే ఆదిలాబాద్‌, జైనథ్‌, బోథ్‌, ఇచ్చోడలో కొనుగోలు చేస్తుండగా.. సోమవారం నుంచి అన్ని మార్కెట్‌ యార్డుల్లో కేంద్రాలను ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. కొనుగోళ్లలో పారదర్శకత పాటించడానికి క్రాప్‌ బుకింగ్‌ విధానాన్ని అమలు చేయనున్నారు. సాగు చేసిన వివరాలను వ్యవసాయశాఖ అధికారులు ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. వీటి ఆధారంగా రైతుల వద్ద పంటను మాత్రమే కొంటారు. ఈ విధానం అమలు చేస్తుండడంతో దళారులు, వ్యాపారులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో పంటను విక్రయించే అవకాశం ఉండదు.

చివరి గింజా కొనుగోలు చేస్తాం..
రైతులు యాసంగిలో సాగు చేసిన జొన్నలను చివరి గింజ దాకా కొనుగోలు చేస్తాం. పంట సేకరణలో పారదర్శకత కోసం క్రాప్‌బుకింగ్‌ విధానం అమలు చే స్తాం. ఆదిలాబాద్‌ జిల్లాలో నాలుగు కేంద్రాల్లో పంట సేకరణ జరుగుతుండగా.. నాలుగు రోజు ల్లో తొమ్మిది మార్కెట్‌ యార్డుల పరిధిలో కొనుగోలు ప్రారంభింస్తాం. రైతులు నాణ్యమైన పంట ఉత్పత్తులను తీసుకొచ్చి మద్దతు ధర పొందాలి. తమ పాస్‌ పుస్తకాలను దళారులు, వ్యాపారులకు ఇవ్వవద్దు.
పుల్లయ్య, మార్క్‌ఫెడ్‌, జిల్లా మేనేజర్‌, ఆదిలాబాద్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
జొన్న రైతుకు మద్దతు

ట్రెండింగ్‌

Advertisement