e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home ఆదిలాబాద్ మన పథకాలు దేశానికే ఆదర్శం

మన పథకాలు దేశానికే ఆదర్శం

మన పథకాలు దేశానికే ఆదర్శం

ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న
కొబ్బాయిలో దళితబస్తీ లబ్ధిదారులకు పెట్టుబడి చెక్కులు పంపిణీ

బేల, జూన్‌ 10 : రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు మరే రాష్ట్రంలోనూ లేవని, ఈ పథకాలు దేశంలోనే ఆదర్శమ ని ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. మండలంలోని కొబ్బాయి గ్రామంలో దళితబస్తీ లబ్ధిదారులకు పంట పెట్టుబడి చెక్కులను మండల నాయకులతో కలిసి గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దళిత బస్తీ పథకంలో భాగంగా ఎస్సీలకు మూడెకరాల భూమిని ఇవ్వడమే కాకుండా పంట పెట్టుబడి సాయం కూడా అందజేస్తున్నామని తెలిపా రు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, రైతు బంధు, రైతు బీమా, అమ్మ ఒడి, విద్యార్థులు చదువుకోవడానికి గురుకులాలు.. ఇలా అనేక పథకాలు రాష్ట్రంలో అమలవుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రావుత్‌ మనోహర్‌, టీఆర్‌ఎస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు గంభీర్‌ ఠాక్రే, ఆడనేశ్వర్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ సతీశ్‌ పవార్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు ప్రమోద్‌ రెడ్డి, సర్పంచ్‌లు ఇంద్రశేఖర్‌, తేజ్‌రావు, విపిన్‌, నాయకులు దేవన్న, మస్కే తేజ్‌రావ్‌, మంగేశ్‌ ఠాక్రే, సుదర్శన్‌, సంతోష్‌ బెదుల్కర్‌, సర్పంచ్‌లు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మన పథకాలు దేశానికే ఆదర్శం

ట్రెండింగ్‌

Advertisement