e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 16, 2021
Home ఆదిలాబాద్ జొన్నలను ప్రభుత్వమే కొంటుంది

జొన్నలను ప్రభుత్వమే కొంటుంది

జొన్నలను ప్రభుత్వమే కొంటుంది

ఆదిలాబాద్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మెట్టు ప్రహ్లాద్‌
వ్యవసాయ మార్కెట్‌ యార్డులో కొనుగోలు కేంద్రం ప్రారంభం

తాంసి, జూన్‌ 9: రైతులు పండించిన జొన్నలను ప్రభు త్వమే కొనుగోలు చేస్తుందని ఆదిలాబాద్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మెట్టు ప్రహ్లాద్‌ అన్నారు. ఆదిలాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డులో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డితో కలిసి జొన్నల కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జొన్నలు క్వింటాలుకు రూ.2620 చెల్లించి కొంటా మన్నారు. రైతులు పండించిన మొత్తం పంటను మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేయనున్నట్లు చెప్పారు. గ్రామాల వారీగా తేదీలను ప్రకటిస్తామని తెలిపారు. రైతులు ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. ప్రతి పక్షాల నాయకులు తప్పుదోవ పట్టించేందుకు ఆరోపణలు చేస్తు న్నారని, రైతులు జాగ్రత్తగా ఉండాలని కోరారు. ఈ సందర్భంగా మార్కెట్‌కు జొన్నలు తెచ్చిన రైతులను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో మార్క్‌ఫెడ్‌ డీఎం పుల్ల య్య, జిల్లా మార్కెటింగ్‌ అధికారి శ్రీనివాస్‌, మార్కెట్‌ డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు.
జైనథ్‌, జూన్‌ 9: మండల కేంద్రంలోని మార్కెట్‌ యా ర్డులో బుధవారం ఎంపీపీ మార్శెట్టి గోవర్ధన్‌ జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రైతు సంక్షేమ ప్రభుత్వం ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం క్వింటాలు జొన్నలను రూ. 2620 మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తుందన్నారు. ఈ సందర్భంగా జొన్నలు కొనుగోలుకు సమ్మతించిన సీఎం కేసీఆర్‌కు, ఎమ్మెల్యే జోగురామన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ బాలూరి గోవర్ధన్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్‌ ఎస్‌. లింగారెడ్డి, టీఆర్‌ఎస్‌ పార్టీ మండల కన్వీనర్‌ తుమ్మల వెంకట్‌రెడ్డి, సీఈవో గంగన్న, సర్పంచ్‌ దేవన్న, ఆలయ కమిటీ చైర్మన్‌ పుండ్రు వెంకట్‌రెడ్డి, ఎంపీటీసీ సుదర్శన్‌, అధికారు లు, నాయకులు పాల్గొన్నారు.

రైతులకు అండగా ప్రభుత్వం
ఆదిలాబాద్‌ రూరల్‌, జూన్‌ 9: రాష్ట్రంలో రైతులకు అండగా ప్రభుత్వం నిలుస్తున్నదని రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని కైలాస్‌నగర్‌లో ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో రైతులు ఎలాంటి పంటను పం డించినా కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆ దేశాలు జారీ చేసినట్లు తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్‌ నాయ కులు రైతులను రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి టీఆర్‌ఎస్‌ నా యకులపై ఆరోపణలు చేశారని మండిపడ్డారు. ప్రభుత్వం జొన్న కొనుగోలుకు ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్‌ బాపురావ్‌, రాష్ట్ర డెయిరీ చైర్మన్‌ లోక భూమారెడ్డి సీఎం కేసీఆర్‌కు పలుమార్లు విన్నవించారని పేర్కొన్నారు. ఇందు కు ముఖ్యమంత్రి సమ్మతించినట్లు తెలిపారు. సమావేశం లో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మెట్టు ప్రహ్లాద్‌, ఆత్మ చై ర్మన్‌ జిట్టా రమేశ్‌, నాయకులు సెవ్వ జగదీశ్‌, దారుట్ల జీ వన్‌, మల్లేశ్‌, తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

-రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
జొన్నలను ప్రభుత్వమే కొంటుంది

ట్రెండింగ్‌

Advertisement