e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, April 15, 2021
Advertisement
Home ఆదిలాబాద్ మాస్కు ధరించకుంటే జరిమానా

మాస్కు ధరించకుంటే జరిమానా

మాస్కు ధరించకుంటే జరిమానా

ఆదిలాబాద్‌ ట్రాఫిక్‌ సీఐ గంగాధర్‌
జిల్లాలో పలుచోట్ల అవగాహన సదస్సులు

ఎదులాపురం,ఏప్రిల్‌ 8 : కొవిడ్‌ నిబంధనలు పాటించకుంటే జరిమానా విధిస్తామని ఆదిలాబాద్‌ ట్రాఫిక్‌ సీఐ గంగాధర్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని కిరాణ మర్చంట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో గురువారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో కిరాణ మర్చంట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బండారి వామన్‌, కోశాధికారి సునీల్‌ చింతవార్‌, కార్యదర్శి పాండురంగ , ట్రాఫిక్‌ ఎస్‌ఐలు రామరావు, అబ్దుల్‌ బాకీ, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.
ఇంద్రవెల్లి, ఏప్రిల్‌ 8 : మాస్కు ధరించకుంటే జరిమానా విధిస్తామని తహసీల్దార్‌ రాఘవేంద్రరావ్‌, ఇంద్రవెల్లి సర్పంచ్‌ కోరెంగా గాంధారి హెచ్చరించారు. మండలకేంద్రంలోని దుకాణాల్లో తిరుగుతూ వ్యాపారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దుకాణాల్లో శానిటైజర్లను ఏ ర్పాటు చేయాలని, వినియోగదారులు భౌతిక దూరం పాటించేలా చూడాలన్నారు. గ్రామపంచాయతీ ఈవో శ్రీనివాస్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ కోరెంగా సుంకట్‌రావ్‌, పోలీస్‌ సిబ్బంది పరశురాం, దేవిదాస్‌, గోకుల్‌, నాయకులు పాల్గొన్నారు.
నార్నూర్‌, ఏప్రిల్‌ 8 : మండలంలోని గంగాపూర్‌లో ఎస్‌ఐ మాదాసు విజయ్‌కుమార్‌ అవగాహన కల్పించారు. కార్యక్ర మంలో ట్రెయినీ ఎస్‌ఐలు రాధిక, ధన్‌శ్రీ, హెడ్‌ కానిస్టేబుల్‌ దుర్వా సంతోష్‌, హోంగార్డు బాలాజీ, స్థానికులు ఉన్నారు.
బేల, ఏప్రిల్‌ 8 : మండలంలోని దహిగాం పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్‌ వారడే అంబుతాయి గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొవిడ్‌ నిబంధనలు తప్పకుండా పాటించాలని సూచించారు. వార్డు సభ్యులు వాంఖడే శుభం, అబ్దుల్‌ ఖయర్‌, కార్యదర్శి గజానన్‌ , అంగన్‌వాడీ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
బోథ్‌, ఏప్రిల్‌ 8: మండలంలోని పట్నాపూర్‌ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్‌ పంద్రం సుగుణ సమావేశం నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శి మిథున్‌, వార్డు సభ్యులు పెందూరు గంగామణి, దశరథ్‌, ఆడెం భీంరావు, పంద్రం శంకర్‌, ఆప్క నాథం పాల్గొన్నారు.
ఇచ్చోడ ఏప్రిల్‌ 8 : పంచాయతీ కార్యాలయంలో పాలక వర్గం, అధికారులు, ప్రముఖులతో కలిసి సర్పంచ్‌ చౌహాన్‌ సునీత ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కొవిడ్‌ నిబంధనలు పాటించేలా చూడాలన్నారు. అతిక్రమిస్తే జరిమా నా వి ధించాలని సూచించారు.ఉప సర్పంచ్‌ లో క శిరీశ్‌ రెడ్డి, ఎంపీటీసీ శివ కుమార్‌ రెడ్డి, జాహెద్‌, ఎంపీడీవో రాం ప్రసాద్‌, ఎం పీవో రమేశ్‌, ఈవో నర్సారెడ్డి, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.
భీంపూర్‌, 8 : పిప్పల్‌కోటి ఎస్‌ఐ ఆరిఫ్‌ అవగాహన కల్పిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక పీహెచ్‌సీలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారని, వ్యాక్సినేషన్‌ కూ డా కొనసాగుతున్నదని, ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా అర్హులందరూ టీకా వేసుకోవాలని సూచించా రు. సిబ్బంది నాగనాథ్‌ , ఉత్తం, రమేశ్‌ , శ్రీనివాస్‌ , సర్పంచ్‌ కేమ కల్యాణి, వైస్‌ ఎంపీపీ గడ్డం లస్మన్న ,గ్రామస్తులు ఉన్నారు.
బజార్‌హత్నూర్‌ ఏప్రిల్‌ 8 : మండలకేంద్రంలోని వారసంతలో ఎస్‌ఐ ఉదయ్‌కుమార్‌ అవగాహన కల్పించారు. గ్రామ పంచాయతీ సిబ్బందితో కలిసి మాస్కులు ధరించని వారికి మా స్కులు అందజేశారు. వార్డు మెంబర్‌ సా యన్న, పంచాయతీ కార్యదర్శి సాయిప్రసాద్‌, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.
బేల, ఏప్రిల్‌ 8 : మండల కేంద్రంలోని పలు కిరాణ షాపులను ఎస్‌ఐ సాయన్న తనిఖీ చేశారు. అనంతరం షాపుల ఎదుట కొ నుగోలుదారులు సామాజిక దూరం పాటించేలా పెయింట్‌తో బాక్స్‌లు గీయించారు.
తాంసి, ఏప్రిల్‌ 8 : మాస్కు ధరించకుంటే జరిమానా విధిస్తామని జిల్లా అదనపు కలెక్టర్‌ డేవిడ్‌ అన్నారు. ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని రైతుబజార్‌, శివాజీ చౌక్‌లో పోలీసులతో కలిసి మాస్కు ధరించని నలుగురికి రూ. 1000 చొప్పున, ఇద్దరికి రూ. 500 చొప్పున జరిమానా విధించారు. ఆయన వెంట ఎస్‌ఐ అప్పారావు, తదితరులు ఉన్నారు.

Advertisement
మాస్కు ధరించకుంటే జరిమానా

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement