e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home ఆదిలాబాద్ నియోజక వర్గ అభివృద్ధికి కృషి

నియోజక వర్గ అభివృద్ధికి కృషి

నియోజక వర్గ అభివృద్ధికి కృషి

గుడిహత్నూర్‌,జూన్‌7: బోథ్‌ నియోజక వర్గా న్ని అన్ని విధాల అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావ్‌ అన్నారు. మండలంలోని బెల్లూరి సమీపంలో రేండ్లబోరిలో రూ.1. 92 కోట్లతో నిర్మించనున్న చెక్‌డ్యామ్‌ నిర్మాణానికి సోమవారం ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. నియోజక వర్గానికి 25 చెక్‌డ్యామ్‌లు మంజూరయ్యాయని, 21 చెక్‌డ్యామ్‌ల పనులు 80శాతం వరకు పూర్తయినట్లు వెల్లడించారు. గుడిహత్నూర్‌ మండలానికి నాలుగు చెక్‌డ్యామ్‌లు మంజూరైనట్లు వివరించారు. వనరులు ఉన్న చోట చెక్‌డ్యామ్‌లు నిర్మించి భూగర్భజల మట్టం పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల కన్వీనర్‌ కరాడ్‌ బ్రహ్మానంద్‌, మన్నూర్‌ పీఏసీఎస్‌ చైర్మన్‌ కరాడ్‌ ప్రకాశ్‌, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ జంగు,ఎంపీటీసీలు కేంద్రే న్యాను, శగీర్‌ఖాన్‌, టీఆర్‌ఎస్‌ ఉమ్మడి జిల్లా కోశాధికారి బీ లక్ష్మీనారాయణ, మాజీ ఎంపీటీసీ కొల్లూరి వినోద్‌, దిలీప్‌, జలంధర్‌, పరమేశ్వర్‌, రైతులు పాల్గొన్నారు.
కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
నేరడిగొండ, జూన్‌ 7 : మండలంలోని 28 మందికి కల్యాణలక్ష్మి చెక్కులు మంజూరు కాగా, నేరడిగొండలో ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావ్‌ అందజేశారు.దేశంలోఎక్కడా లేని విధంగా మన రాష్ట్రం లో పథకాలను సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్నార న్నారు. తహసీల్దార్‌ శ్రీదేవి, జడ్పీటీసీ అనిల్‌ జాదవ్‌, ఎంపీపీ రాథోడ్‌ సజన్‌, బోథ్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ దావుల భోజన్న, టీఆర్‌ఎస్‌ మండల కన్వీనర్‌ అల్లూరి శివారెడ్డి, వైస్‌ ఎంపీపీ ఏలేటి మహేందర్‌రెడ్డి, నేరడిగొండ సర్పంచ్‌ పెంట వెంకటరమణ, నాయకులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నియోజక వర్గ అభివృద్ధికి కృషి

ట్రెండింగ్‌

Advertisement