e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home ఆదిలాబాద్ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతోనే గుర్తింపు

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతోనే గుర్తింపు

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతోనే గుర్తింపు

జడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్ధన్‌
రంజాన్‌ కానుకల అందజేత

ఇంద్రవెల్లి, మే 7 : తెలంగాణ ప్రభుత్వంతోనే పండుగలతోపాటు ఉత్సవాలకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని జడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్ధన్‌ పేర్కొ న్నారు. రంజాన్‌ పురస్కరించుకొని ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న రంజాన్‌ కాను కలను ఇంద్రవెల్లి గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో ముస్లింలకు శుక్రవారం జడ్పీ చైర్మన్‌ పంపిణీ చేశారు. అనంతరం వాటర్‌ డే సందర్భంగా మొక్కకు నీరు పోశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ రాష్ట్ర ప్రభుత్వం కులమతాలకు అతీతంగా ముందుకెళ్తున్నదని పేర్కొన్నారు. ఎంపీపీ పోటే శోభాబాయి, జడ్పీ కోఆప్షన్‌ సభ్యుడు మహమ్మద్‌ అబ్దుల్‌ అమ్జద్‌, ఏఎంసీ చైర్మన్‌ రాథోడ్‌ మోహ న్‌నాయక్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ మారుతీ డోంగ్రే, ఎంపీడీవో పుష్పలత, సర్పంచ్‌ కోరెంగా గాంధారి, ఎంపీటీసీ జాదవ్‌ స్వర్ణలత, ఆర్‌ఐ మెస్రం లక్ష్మణ్‌, ఈవో శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల మాజీ అధ్యక్షుడు షేక్‌ సుఫియాన్‌, నాయకులు దేవ్‌పూజె మారుతి, సుంకట్‌రావ్‌, మహేశ్‌ కదం, బాబు ముండే, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
మైనార్టీలకు అండగా ప్రభుత్వం
నిర్మల్‌ అర్బన్‌, మే 7 : మైనార్టీలకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అండగా ఉంటున్నదని టీఆర్‌ఎస్‌ మైనార్టీ నాయకులు రిజ్వాన్‌ ఖాన్‌ పేరొన్నారు. రంజాన్‌ గిఫ్ట్‌ ప్యాక్‌లను 23వ వార్డు కబూతర్‌ కమాన్‌లో ఆయన పంపిణీ చేశారు. కౌన్సిలర్‌ జహీర్‌, నాయకులు రజీ అహ్మద్‌, అక్తర్‌ అహ్మద్‌, సమి, వకీల్‌ తదితరులున్నారు.
కుంటాలలో..
కుంటాల, మే 7 : మండల కేంద్రంలో రంజా న్‌ కానుకలను సర్పంచ్‌ సమత ముస్లింలకు అంద జేశారు. ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి కృషి చేస్తున్నదని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ నాయకులు వెంకటేశ్‌, శంకర్‌, బాలయ్య ఉన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతోనే గుర్తింపు

ట్రెండింగ్‌

Advertisement