కౌటాల, ఆగస్టు 4 : తల్లి పాల వారోత్సవాల్లో భాగంగా మండల కేంద్రంలో అవగాహన ర్యాలీ తీశారు. ఎంపీపీ బసార్కర్ విశ్వనాథ్ పాల్గొని, తల్లి పాల విశిష్ఠత వివరించారు. ఈ ర్యాలీలో కో-ఆప్షన్ సభ్యుడు అజ్మత్, వైద్యాధికారి పల్లవి, సర్పంచ్ వొజ్జల మౌనిష్, ఐసీడీఎస్ సూపర్వైజర్ కావ్య, ఉప సర్పంచ్ తిరుపతి, కార్యదర్శి సాయికృష్ణ, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
లింగాపూర్, ఆగస్టు 4 : మండలంలోని గోండుగూడ, మా మిడిపల్లి గ్రామాల్లో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించా రు. అంగన్వాడీ టీచర్లు తల్లిపాల ఆవశ్యకతపై అవగాహన క ల్పించారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు అనిత, శీల, ఆశ కార్యకర్తలు, గర్భిణులు, బాలింతలు, హెల్పర్లు పాల్గొన్నారు.
దహెగాం, ఆగస్టు 4 : చిన్నరాస్పల్లి అంగన్వాడీ కేంద్రంలో ంపీపీ కంభగోని సులోచన ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. తల్లిపాలు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న సేవలను గర్భిణులు, బాలింతలు, కిషోర బాలికలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సర్పంచ్ తుమ్మిడ అమృత, సూపర్వైజర్ సుధారాణీ, అంగన్వాడీ కార్యకర్త శోభ, నాయకలు పాపయ్య, తదితరులు పాల్గొన్నారు.