బుధవారం 08 ఏప్రిల్ 2020
Adilabad - Jan 15, 2020 , 00:36:09

నదీ జలాలతో తిరుగు పయనం

నదీ జలాలతో తిరుగు పయనం
  • కలమడుగులో జలాలను సేకరించిన మెస్రం వంశీయులు
  • కలమడుగు నుంచి బయలుదేరిన మెస్రం వంశీయులు
  • 24న నాగోబాకు మహాపూజ
  • కాలినడకన కెస్లాపూర్‌కు..

ఉట్నూర్‌, నమస్తే తెలంగాణ: నాగోబా ఆలయంలో నిర్వహించే మహాపూజకు  అవసరమయ్యే నదీజలం కోసం మంచిర్యాల్‌ జిల్లా కలమడుగు చేరుకున్న మెస్రం వంశీయులు తిరిగి నదీజలంతో బయలుదేరారు. కలమడుగు గ్రామ ప్రజలు మెస్రం వంశీయులను ఘన స్వాగతం పలికారు. సోమవారం చేరుకున్న మెస్రం వంశీయులు మంగళవారం ఉదయం గోదావరిలో పుణ్యస్నానం ఆచరించి హస్తనమడుగులో నదీజలం తీసుకొని బయలుదేరి వెళ్లారు.


ఇక్కడి నుంచి ఇస్లాంపూర్‌ చేరుకొని గౌరి గ్రామంలో రెండు రోజులు ఉండి అక్కడి నుంచి నాగోబా ఆలయంలోని మర్రిచెట్టుకు జలం కట్టి  ఎవరి ఇండ్లకు వెళ్లిపోతామన్నారు. తర్వాత ఎడ్లబండ్లు, కుటుంబీకులతో తిరిగి నాగోబా ఆలయానికి చేరుకుంటామని చెప్పారు. మర్రిచెట్టు వద్ద తూమ్‌ నిర్వహించి, 24న మహాపూజ చేస్తామన్నారు. అనంతరం జాతర ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తామన్నారు. అనంతరం ఎంపీపీ పంద్ర జైవంత్‌రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో తుక్‌డోజీ, వెంకట్‌రావు, తిరుపతి, బాజీరావు, చిన్ను పటేల్‌, బాదీరావు, లింబారావు, కటోడ హనుమంత్‌రావు, పర్ధాంజీ, మనోహర్‌, దుర్గు, కోశారావు, నాగోరావు, గణపతి, దాదారావు, పాండ్‌రంగ్‌, తుకారాం తదితరులు పాల్గొన్నారు. 


logo