ఎదులాపురం, జూలై 29 : శాస్త్రీయత కలిగిన వినూత్య ఆలోచనలను ఆవిష్కరించేందుకు ప్రో త్సాహం కల్పిస్తామని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా ప ట్నాయక్ అన్నారు. కలెక్టర్ క్యాంప్కార్యాలయం లో ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆసక్తి, అ ర్హత కలిగిన వారు వయస్సుతో సంబంధం లే కుండా ఆవిష్కరణలను ఆగస్టు 10వ తేదీలోగా పూర్తి వివరాలను 9100678543 వాట్సాప్ నం బర్కు పంపించాలని తెలిపారు. ఆవిష్కరణలకు సంబంధించిన ఆరు వాక్యాలు, రెండు నిమిషాల వీడియో, నాలుగు ఫొటోలు, ఆవిష్కర్త పేరు, ఫోన్ నంబర్, వయస్సు, ప్రస్తుత వృత్తి, గ్రామం, జిల్లా తదితర వివరాలను పంపించాలని సూచించారు. ఆవిష్కరణలను స్వాతంత్య్ర దినోత్సవం రోజున పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ప్రదర్శింపజేసి, జిల్లా స్థాయిలో కలెక్టర్, అధికారులు పరిశీలించి రాష్ట్రస్థాయికి ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఇతర వివరాకు జిల్లా సైన్స్ అధికారి కే రఘురమణ 9440060288 నంబర్‌కు సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఈవో రవీందర్ రెడ్డి, డీపీఆర్వో ఎస్ భీమ్‌కుమార్, ఈడీఎం రవి, జిల్లా పరీక్షల విభాగం కార్యదర్శి అశోక్, ఉమ్మడి జిల్లా ఓపెన్ స్కూల్ కో-ఆర్డినేటర్ అశోక్, ఏఎస్వో మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు.