e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 21, 2021
Home ఆదిలాబాద్ స్వరాష్ట్రంలో అన్ని వర్గాలకూ ప్రాధాన్యం

స్వరాష్ట్రంలో అన్ని వర్గాలకూ ప్రాధాన్యం

  • జిల్లా కేంద్రంలో త్వరలోనే బంజారా భవన్‌ నిర్మిస్తాం
  • ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న
  • ఆలిండియా బంజారా సేవా సమితి జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన అమర్‌సింగ్‌ తిలావత్‌కు ఘన సన్మానం

ఎదులాపురం, జూలై 31: స్వరాష్ట్రం సాధించుకున్న తరువాత సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం అన్ని వర్గాలకూ ప్రాధాన్యం కల్పిస్తున్న దని ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆలిండి యా బంజారా సేవా సమితి జాతీయ అధ్యక్షుడిగా అమర్‌సింగ్‌ తిలావత్‌ రెండో సారి ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా జిల్లా కేంద్రంలోని కైలాస్‌ నగర్‌ వద్ద శనివారం సన్మానించారు. జడ్పీ చైర్మన్‌ జనార్దన్‌ రాథోడ్‌, బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావుతో కలిసి ఎమ్మెల్యే జోగు రామన్న హాజరయ్యారు. ముందుగా డీసీసీబీ చైర్మన్‌ నాందేవ్‌ కాంబ్లే మృతికి నాయకులు రెండు నిమిషా లు మౌనం పాటించారు. అనంతరం ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలోని బీసీ భవన్‌ పక్కనే బంజారా భవన్‌ ఏర్పాటు చేయిస్తామన్నారు. సీఎం కేసీఆర్‌కు విన్నవించి, ప్రత్యేక నిధులు తెస్తామని పేర్కొన్నారు. సమాజ శ్రేయస్సు కో సం నిలబడే వారిలో తిలావత్‌ ముందుంటారని కొనియాడా రు. తిలావత్‌ మంత్రిగా ఉన్నప్పటి నుంచి బంజారాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. జాతీయ అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికవడం ఆదిలాబాద్‌ జిల్లాకే గర్వకారణంగా భా విస్తున్నామన్నారు.

జడ్పీ చైర్మన్‌ జనార్దన్‌ రాథోడ్‌ మాట్లాడు తూ.. ఇచ్చిన హామీ ప్రకారం జిల్లా కేంద్రంలో బంజారాల భవ న్‌ కోసం ఎకరం భూమిని ఎమ్మెల్యే రామన్న ఇప్పించారని, త్వ రలోనే భవన నిర్మాణ పనులు కూడా ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావ్‌ మాట్లాడుతూ.. అన్ని కుల సంఘాల భవనాల కోసం స్థలం, నిధులను ఎమ్మెల్యే జోగు రామన్న మంజూరు చేయడం అభినందనీయమన్నారు. అమర్‌ సింగ్‌ తిలావత్‌ మాట్లాడుతూ.. రెండోసారి జాతీయ అ ధ్యక్షుడిగా ఎన్నికవడం సంతోషంగా ఉందన్నారు. సంఘ భవన స్థ లంలో మొక్కలు నాటి నీరు పోశారు. ఆదిలాబాద్‌ మార్కెట్‌ క మిటీ చైర్మన్‌ మెట్టు ప్రహ్లాద్‌, మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌, బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు రాథోడ్‌ రామరావు, దుర్గం ట్రస్ట్‌ చైర్మన్‌ దుర్గం శేఖర్‌, బంజారా సంఘం నా యకులు కిషన్‌రావు చౌహాన్‌, హీరాలాల్‌, శ్యామ్‌రావు, సీతారాం నాయక్‌, గంగారాం, శంకర్‌ పవార్‌, గుణవంత్‌రావు, మాజీ జడ్పీటీసీ అశోక్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు రాంకుమార్‌, యూనిస్‌ అక్భానీ, మర్సుకోల తిరుపతి, తదితరులున్నారు.

- Advertisement -

డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ
బేల మండలంలోని మసాలా గ్రామపంచాయతీ పరిధిలో తెలంగ్‌రావ్‌ గూడలో డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణానికి మండల నాయకులతో కలిసి ఎమ్మెల్యే జోగు రామన్న భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి సర్కారు కృషి చేస్తున్నదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను త్వరలోనే ఆదిలాబాద్‌ జిల్లాలో పర్యటించాలని కోరుతా మని, జిల్లాలో ఆదివాసుల సమస్యలు పరిష్కరించేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఆదివాసులు సాగు చేస్తున్న ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రావుత్‌ మనోహర్‌, వైస్‌ ఎంపీపీ బండి సుజాత, నాయకులు గంభీర్‌ ఠాక్రే, సతీశ్‌ పవార్‌, ఇంద్రశేఖర్‌, ప్రమోద్‌ రెడ్డి, బండి సుదర్శన్‌ , బత్తుల సుదర్శన్‌, మస్కేతేజ్‌రావు, వాడ్కర్‌ తేజ్‌రావు, ఆరున్‌, పీఆర్‌ డీఈ రఫత్‌ఖాన్‌, ఏఈ ప్రకాశ్‌, ఐటీడీఏ ఏఈ సుధాకర్‌, ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana