e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 18, 2021
Home ఆదిలాబాద్ పులులను కాపాడుకోవాలి

పులులను కాపాడుకోవాలి

బెజ్జూర్‌, జూలై 29 : పులులను కాపాడుకోవాలని బెజ్జూర్‌ రేంజ్‌ అధికారి దయాకర్‌ అన్నారు. గురువారం అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలో ర్యాలీ తీశారు. అనంతరం రేంజ్‌ కార్యాలయంలో సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు. బెజ్జూర్‌ అటవీ ప్రాంతంలో పులుల హా బిటేట్‌ మేనేజ్‌మెంట్‌ నిర్వహణ, పులుల రక్షణకు తీసుకోవాల్సిన చర్యలను సిబ్బందికి వివరించారు. పులుల ఆహారమైన శాఖాహార వన్య ప్రాణులను వేటాడకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. వేసవిలో పులులకు తాగునీటికి ఇబ్బందుల్లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో డీఆర్‌వోలు శీలానంద్‌, సవిత, ఎఫ్‌ఎస్‌వోలు, ప్రసా ద్‌ రావు, అజ్మీరా మోహన్‌, ఎప్‌బీవోలు అనిత, సంజయ్‌, శ్రీ కాంత్‌, శ్రీధర్‌, బేస్‌ క్యాంప్‌, ఎనిమల్‌ ట్రాకర్‌ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

సిర్పూర్‌( టీ) మండలకేంద్రంలో..
సిర్పూరు అటవీ డివిజన్‌ పరిధిలో ప్రపంచ పులుల దినోత్సవాన్ని ఫారెస్ట్‌ అధికారులు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీ తీసి పులుల గురించి వివరించారు. అనంతరం చీలపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు డ్రాయింగ్‌ కాంపిటీషన్‌ నిర్వహించారు. ప్రతిభ చూపిన వారికి బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ రేంజర్‌ పూర్ణచందర్‌, ప్రతాప్‌ నాయక్‌, ప్రకాశ్‌, భానేశ్‌, ముసవీర్‌, సెక్షన్‌ ఆఫీసర్లు మోహన్‌రావు, సంతోష్‌, సిబ్బంది బీట్‌ ఆఫీసర్లు దేవేందర్‌, గోపాల్‌, తదితరులు ఉన్నారు.

- Advertisement -

అగర్‌గూడలో అవగాహన
మండలంలోని అగర్‌గూడలో కాగజ్‌నగర్‌ ఎఫ్‌డీవో విజయ్‌కుమార్‌ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ సిబ్బంది తీసుకుంటున్న చర్యలతో కాగజ్‌నగర్‌ డివిజన్‌లో పులుల సంతతి పెరిగిందన్నారు. అనంతరం గ్రామానికి చెం దిన ఐదుగురు మహిళలకు కుట్టు మిషన్లు, ఆరుగురికి సైకిళ్లను పంపిణీ చేశా రు. కార్యక్రమంలో సర్పంచ్‌ సుధాకర్‌, డిప్యూటీ రేంజ్‌ అధికారులు ప్రభాకర్‌, రమాదేవి, బీట్‌ ఆఫీసర్లు నారాయణ, గిరిబాబు, కస్తూర్బా గాంధీ ఎస్‌వో కవిత, ఉపాధ్యాయురాలు స్నేహలత, ప్రజలు, సిబ్బంది పాల్గొన్నారు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana