e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 21, 2021
Home ఆదిలాబాద్ తహసీల్దార్లు కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలి

తహసీల్దార్లు కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలి

బేల, ఆగస్టు 3 : ఎస్సీ మహర్‌ కులస్తులకు తహసీల్దార్లు కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని మహర్‌ బెటాలియన్‌ జిల్లా సభ్యుడు మస్కేతేజ్‌రావు కోరారు. మండల కేంద్రంలో తహసీల్దార్‌ బడాల రాంరెడ్డికి మంగళవారం విన తి పత్రం అందజేశారు. ప్రస్తుతం తమకు ఆర్డీవో కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్నారని, ఇందుకు నెలల తరబడి ఎదుచూడాల్సి వస్తున్నదన్నారు. దీంతో విద్యార్థులు, నిరుద్యోగులు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందలేకపోతున్నా రని, సంక్షేమ పథకాలకు సకాలంలో దరఖాస్తు చేసుకోలేక అవకాశాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమలో నాయకులు గజానన్‌, బిక్కన్‌, గణేశ్‌, అజయ్‌, ఆయా గ్రామాల మహర్‌ కులస్తులు, యువకులు పాల్గొన్నారు.

ఆదిలాబాద్‌ రూరల్‌, ఆగస్టు 3: మహర్‌ బెటాలియన్‌ ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌ రూరల్‌, అర్బ న్‌, మావల తహసీల్దార్లకు వినతిపత్రాలు అం దించారు. రాష్ట్ర నాయకుడు వాగ్మారే శైలేందర్‌, నా యకులు లక్ష్మీకాంత్‌ కాంబ్లే, దయానంద్‌ కాంబ్లే, సుధమ్‌ నికతే, రాజు మాస్కే పాల్గొన్నారు.
గుడిహత్నూర్‌,ఆగస్టు 3: మహర్‌ కులస్తులు స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ర్యాలీగా వెళ్లి తహసీల్దార్‌ పవన్‌చంద్రకు మహర్‌ కులస్తులు వినతి పత్రం ఇచ్చారు. కార్యక్రమంలో న్యాయవాది జోందలే అజయ్‌కుమార్‌, మాధవ్‌ మస్కే, గోవింద్‌ బుద్దె, సిద్ధార్థ్‌ ససానే, మాధవ్‌ ససానే, దహి కాంబ్లే, సంజయ్‌, ఆనంద్‌, సిద్ధార్థ్‌, బబన్‌, బాలేరావ్‌ పాల్గొన్నారు.

- Advertisement -

ఉట్నూర్‌, ఆగస్టు 3 :స్థానిక తహసీల్దార్‌కు మహర్‌ బెటాలియన్‌ సభ్యులు మోకింద్‌, సింగారే భరత్‌ వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో ప్రజ్ఞశీల్‌, మంచెక్‌రావు, భీంరావు ఉన్నారు.
ఇంద్రవెల్లి, ఆగస్టు3 : మహర్‌ బెటాలియన్‌ జిల్లా కమిటీ పిలుపు మేరకు తహసీల్దార్‌ రాఘ వేంద్రరావుకు వినతిపత్రం అందించారు. కార్యక్ర మంలో అంబేద్కర్‌ మెమోరియల్‌ అసోసియేషన్‌ మండలాధ్యక్షుడు సర్కాళే శివాజీ, నాయకులు సత్యానంద్‌, భరత్‌, శత్రుఘన్‌ జీవ్నే, దత్తా ఆచారే, బాబు, శివాజీ పాల్గొన్నారు.

నార్నూర్‌,ఆగస్టు 3: స్థానిక తహసీల్‌ కార్యాలయంలో రెవెన్యూ అధికారులకు టీఆర్‌ఎస్‌ మహర్‌ బెటాలియన్‌ నాయకుల ఆధ్వర్యంలో షెడ్యూల్‌ క్యాస్ట్‌ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్‌ దుర్గే వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ కే పరమేశ్వర్‌, కాంతారావ్‌ దుర్గే, లోకండే చంద్రశేఖర్‌, శాంతారావ్‌, కేశవ్‌, రాజేందర్‌, దమ్మపాల్‌,శాయి పాల్గొన్నారు.
సిరికొండ,ఆగస్టు 3 : సోంపల్లికి చెందిన మహర్‌ బెటాలియన్‌ ఆధ్వర్యంలో తహసీల్దార్‌ సర్ఫరాజ్‌కు మంగళవారం వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో జిల్లా నాయకుడు రామారావ్‌, నాయకులు విశ్వబోధి, రాజు, కృష్ణ, నాగోరావ్‌, ప్రకాశ్‌ పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana