e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 28, 2021
Home ఆదిలాబాద్ కొత్త వారికి త్వరలో పింఛన్‌

కొత్త వారికి త్వరలో పింఛన్‌

  • 57 ఏండ్లు నిండిన వారు అర్హులు
  • ఉమ్మడి జిల్లాలో 59,615 మందికి అవకాశం
  • సీఎం కేసీఆర్‌ ప్రకటనతో లబ్ధిదారుల్లో సంతోషం
  • కొత్త పింఛన్‌లతో 3,94,264కు చేరనున్న పింఛన్‌దారుల సంఖ్య

ఆదిలాబాద్‌, ఆగస్టు 2 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తున్న ప్రభుత్వం అభాగ్యులకు బాసటగా నిలుస్తున్నది. వారు కుటుంబంలో, సమాజంలో గౌరవంగా బతికేలా చేయూతనందిసున్నది. వృద్ధులు, దివ్యాంగు లు, వితంతువులు, చేనేత, కల్లుగీత కార్మికులు, ఒంటరి మహిళలు, బోదకాల బాధితులు, బీడీ కార్మికులకు ప్రభుత్వం ప్రతి నెల ఆసరా పింఛన్లు అందిస్తూ ఆదుకుంటున్నది. గతంలో ఉన్న రూ.1000 పింఛన్‌ను రూ.2016కు, దివ్యాంగులు పింఛన్‌ రూ. 1500 నుంచి రూ.1 3016కు పెంచింది. కరోనా ఆపత్కాలంలో ఆర్థిక ఇబ్బందులున్నా నెలనెలా డబ్బులు మంజూరు చే సింది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3,34,649 మంది లబ్ధిదారులకు సర్కారు ప్రతి నెలా పింఛన్లు అందిస్తున్నది. మ రింత మందికి వృద్ధాప్య పింఛన్‌ అర్హత వయస్సును 65 ఏళ్ల వారు అర్హులు కాగా ప్రభుత్వం 57 ఏళ్లకు తగ్గించింది. దీం తో కొత్తగా ఎంపికైన లబ్ధిదారులకు కూడా త్వరగా పింఛన్లు పంపి ణీ చేయాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. దీంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా లబ్ధిదారుల్లో హర్షం వ్యక్తమవుతున్నది.

కొత్తగా 59,615 మంది లబ్ధిదారులు
ప్రభుత్వం పింఛన్‌ వయస్సు తగ్గించడంతో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లావ్యాప్తంగా 59,615 మందికి లబ్ధి చేకూరనుంది. ఆదిలాబాద్‌ జిల్లాలో 10,531 మంది, నిర్మల్‌ జిల్లాలో 18,815, మంచిర్యాల జిల్లాలో 17,269 మంది, కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 13,000 మంది 57 ఏళ్లు దాటిన వృద్ధులను అర్హులుగా అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3,34.649 మందికి ప్రభుత్వం ప్రతి నెల ఆదిలాబాద్‌ జిల్లాలో 65,682 మందికి, నిర్మల్‌ జిల్లాలో 1,38,908, కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 47,578, మంచిర్యాల జిల్లాలో ప్రస్తుతం 85,481 మందికి ప్రస్తుతం పింఛన్‌ ఇస్తుంది. కొత్తగా మంజూరయ్యే వాటితో కలిపి ఉమ్మడి జిల్లాలో లబ్ధిదారుల సంఖ్య 3,94,264కు చేరనుంది.

- Advertisement -

ప్రతి ఇంట్లో పింఛన్‌..
ఉమ్మడి రాష్ట్రంలో వృద్ధాప్య పింఛన్‌ రావాలంటే ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చేది. లబ్ధిదారులు చనిపోతే వారి స్థానంలో కొత్తవారికి ఇచ్చే అవకాశం ఉండేది. నామమాత్రంగా నెలకు రూ.200 ఇచ్చేవారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత తెలంగాణ సర్కారు అభాగ్యులకు అండగా నిలిచింది. అర్హులైన వృ ద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, చేనేత, గీత కార్మికులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, బోదకాల బాధితులు, ఎ యిడ్స్‌ వ్యాధిగ్రస్తులకు ప్రతి నెల పింఛన్లను అందిస్తుంది. దాదా పు ప్రతి కుటుంబంలో పింఛన్‌ లబ్ధిదారులు ఉంటున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana