e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home ఆదిలాబాద్ కరోనా కట్టడికి కట్టుబడి

కరోనా కట్టడికి కట్టుబడి

కరోనా కట్టడికి కట్టుబడి

పలు గ్రామాల్లో స్వచ్ఛంద లాక్‌డౌన్‌
పాలకవర్గాల ఆధ్వర్యంలో తీర్మానం
సహకరిస్తున్న ప్రజలు
నిబంధనలు అతిక్రమిస్తే జరిమానాలు

కరోనా కట్టడికి కట్టుబడి పలు గ్రామాలు స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ పాటిస్తున్నాయి. ప్రభుత్వ ఆదేశాలను పా టిస్తూ నే స్వీయ నియంత్రణపై దృష్టిపెట్టాయి. పాలకవర్గాలు, ప్రజలు, వ్యాపారు లు సమన్వయంతో ఈ తీర్మానం చేసుకుంటుండ గా, ఆయా చోట్ల నిబంధనలు అతిక్రమించే వారి పై జరిమానాలు విధిస్తున్నాయి.
దస్తురాబాద్‌, ఏప్రిల్‌15: మండలంలోని బుట్టాపూర్‌ గ్రా మంలో గురువారం సర్పంచ్‌ బాదం నిరోష ఆధ్వర్యం లో గ్రామ సభ ఏర్పాటు చేశారు. గ్రామంలో ఈ నెల 20 వరకు లాక్‌ డౌన్‌ అమలుకు తీర్మానం చేశారు. కరో నా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో 5 రోజల పాటు లాక్‌ డౌన్‌ పెట్టాలని నిర్ణయించినట్లు స ర్పంచ్‌ తెలిపారు. ఉదయం 5 గంటల నుంచి 10 వరకు సాయంత్రం 4.30 గంటల నుంచి 7.30 గం టల వరకు వ్యాపార దుకాణాలు తెరిచి ఉంటాయని తె లిపారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని, అతిక్రమిస్తే రూ. 500 జరిమానా విధిస్తామని తెలిపా రు. వ్యాక్సిన్‌ తప్పకుండా వేసుకోవాలని సూచిం చారు. ఎస్‌ఐ రాహుల్‌ గైక్వాడ్‌, ఉప సర్పంచ్‌, వార్డు మెంబర్లు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


ఆదిలాబాద్‌ టౌన్‌, ఏప్రిల్‌15: భీంపూర్‌ మండలంలోని కరంజి(టి)లో గురువారం స్వచ్ఛంద లాక్‌డౌన్‌ అమలు చేశారు. మొదటిదశలో సెలూన్లు, హోటళ్లు, పాన్‌ షాప్‌ లు వారం పాటు బంద్‌ ఉంచుతున్నట్లు సర్పంచ్‌ గుర్ల సాత్విక తెలిపారు. మాస్కులు లేకుంటే రూ.500 జరిమానా విధిస్తామని వివరించారు.


లక్ష్మణచాంద, ఏప్రిల్‌15: మండలంలోని వడ్యాల్‌ గ్రా మంలో శుక్రవారం నుంచి స్వచ్ఛంద లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నట్లు వీడీసీ సభ్యులు, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు తెలిపారు.ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరిచి ఉంటాయని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలు తప్పకుండా ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు.

నేరడిగొండ, ఏప్రిల్‌ 15: మండలంలో కరోనా రోజురోజుకూ విస్తరిస్తుండడంతో వాణిజ్య, వ్యాపార సంస్థలు గురువారం స్వచ్ఛందంగా బంద్‌ పాటించాయి. వ్యా పార సంస్థలకు సమయపాలన పాటించాలని పంచాయతీ పాలకవర్గం, గ్రామాభివృద్ధి కమిటీ పిలుపునిచ్చింది. స్వచ్ఛంద లాక్‌డౌన్‌తో మండల కేంద్రం జనసంచారం లేక వెలవెలబోయింది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కరోనా కట్టడికి కట్టుబడి

ట్రెండింగ్‌

Advertisement