e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, October 18, 2021
Home ఆదిలాబాద్ ఆక్సిజన్‌ ప్లాంట్‌ పూర్తి చేయాలి

ఆక్సిజన్‌ ప్లాంట్‌ పూర్తి చేయాలి

  • ప్రజలకు త్వరగా వినియోగంలోకి తేవాలి
  • మంచిర్యాల కలెక్టర్‌ భారతీ హోళికేరి
  • జిల్లా దవాఖానలో పనుల పరిశీలన

మంచిర్యాల ఏసీసీ, సెప్టెంబర్‌ 20 : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో ఏర్పాటు చేస్తున్న ఆక్సిజన్‌ ప్లాంట్‌ పనులను త్వ రగా పూర్తిచేయాలని కలెక్టర్‌ భారతీ హోళికేరి అ న్నారు. జిల్లా దవాఖానను సోమవారం అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ నాయక్‌తో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడు తూ.. టీఎన్‌ఎంఐడీసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆక్సిజన్‌ ప్లాంట్‌ను త్వరగా ప్రారంభించి, సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ప్లాంట ఇన్‌స్టాలేషన్‌ పూర్తిచేయాలని తెలిపారు. దవాఖానలో జరుగుతున్న మరమ్మతు పనులు, వివిధ వార్డులను పరిశీలించారు. జిల్లా నలుమూలల నుంచి దవాఖానకు వచ్చే బాధితులతో స్నేహపూర్వకంగా మెదులుతూ వైద్య సేవలు అందించాలని సూచించారు. దవాఖాన ఆవరణలో కొవిడ్‌ నిబంధనలు పాటించేలా సంబంధిత అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. కలెక్టర్‌ వెంట దవాఖాన పర్యవేక్షకులు డాక్టర్‌ అరవింద్‌, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

అభివృద్ధి పనులపై సమీక్ష..
చెన్నూర్‌ నియోజకవర్గ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో జాప్యం లేకుండా త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్‌ భారతీ హోళికేరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో పంచాయతీరాజ్‌, రోడ్లు భవనాలు, మిషన్‌ భగీరథ, నీటిపారుదల, మున్సిపల్‌, సంబంధిత శాఖల అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. మిషన్‌ భగీరథ నల్లా కనెక్షన్లు, పైపులైన్‌ పనులు త్వరగా పూర్తిచేయాలన్నారు. అలాగే పెద్ద చెరువు కింద మిగతా పనులను వేగవంతం చేయాలని, మొక్కలు నాటి రక్షించాలని సూచించారు. దసరా, బతుకమ్మ పండుగ సమీపిస్తున్నందున చెరువు సమీపంలోని శివాలయానికి వెళ్లే దారి ఏర్పాటు త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఇండ్ల నుంచి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి డంప్‌యార్డుకు తరలించాలన్నారు. వర్షాకాలం కావడంతో నీరు నిల్వ ఉండకుండా చూడాలని తెలిపారు. మురుగుకాలువల్లో పూడిక లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రపర్చాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో పంచాయతీ రాజ్‌ ఈఈ ప్రకాశ్‌, రోడ్లు భవనాల శాఖ ఈఈ రాము, మిషన్‌ భగీరథ డీఈ వెంకటేశ్‌, పంచాయతీ రాజ్‌ డీఈ స్వామి రెడ్డి, మున్సిపల్‌ అధికారులతో పాటు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement