e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 27, 2021
Home ఆదిలాబాద్ అన్నాభావుసాటే సేవలు మరువలేనివి

అన్నాభావుసాటే సేవలు మరువలేనివి

ఆదిలాబాద్‌ రూరల్‌, ఆగస్టు 1: సాహిత్యరంగాని కి అన్నాభావు సాటే చేసిన సేవలు మరువలేనివని జడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్దన్‌ అన్నారు. పట్టణంలోని అన్నాభావుసాటే కూడలిలోని ఆయన విగ్ర హానికి ఆదివారం ఎమ్మెల్యే జోగు రామన్నతో కలి సి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జడ్పీచైర్మన్‌ మాట్లాడుతూ అన్నాభావుసాటే సాహితీ రంగంలో దేశంతో పాటు విదేశాల్లోనూ మంచి పేరుప్రఖ్యాతలు సాధించారన్నారు. ఆయన రచనలు, కవితలు సమాజంలో మార్పునకు శ్రీకా రం చుట్టాయని పేర్కొన్నారు. ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అన్నాభావుసాటేను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఇటీవల మృతి చెందిన డీసీసీబీ చైర్మన్‌ కాంబ్లే నాందేవ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సుఖ్‌దేవ్‌, వాసుదేవ దయానంద్‌, మధుకర్‌, శైలేందర్‌ స్థానిక కౌన్సిలర్‌ బండారి సతీశ్‌, అశోక్‌, నర్సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆదర్శంగా తీసుకోవాలి..
మహనీయులను ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని ఆదిలాబాద్‌ జడ్పీ చైర్మ న్‌ రాథోడ్‌ జనార్దన్‌ అన్నారు. గాదిగూడ మండలంలోని రూప్పాపూర్‌ గ్రామంలో సాహిత్య రత్న సామ్రాట్‌ 101వ జయంతిని ఆదివారం ఘనం గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జడ్పీ చైర్మ న్‌ హాజరయ్యారు. మాతంగ్‌ సమాజ్‌ ఆధ్వర్యం లో ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డీసీసీబీ చైర్మన్‌ నాందేవ్‌ కాంబ్లే మృతి తీరని లోటని పేర్కొన్నా రు. సమాజ హితం కోసం పాటు పడిన అన్నాభా వు సాటే అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలన్నారు. వైస్‌ ఎంపీపీ ఎం.యోగేశ్‌, ఉపసర్పంచ్‌ సుభాష్‌, దళితరత్న నర్సింగ్‌ మోరే, విద్యావేత్త బా లాజీ కాంబ్లే, సలహాదారుడు దత్తరాజ్‌ గైక్వాడ్‌, రాజ్‌కుమార్‌, వెంకటిమోరే, అశోక్‌, సూర్యవంశీ, దేవదాస్‌, పండరీ గైక్వాడ్‌ తదితరులున్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana