కరోనా సెకండ్ వేవ్‌లోనూ బాలీవుడ్ నటుడు సోనూసూద్ సహాయం కొనసాగుతోంది. కొవిడ్ బాధితులు దేశంలో ఎక్కడ ఉన్నా వారికి అవసరమైన ఆర్థిక, వైద్య సాయం చేస్తూ అండగా నిలుస్తున్నాడు.
ఈ క్రమంలోనే భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనాకు సాయం చేసి పెద్ద మనసు చాటుకున్నాడు.
కేవలం 10 నిమిషాల్లోనే మెడికల్ ఆక్సిజన్ సిలిండర్‌ను పంపి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు.
‘మీరట్‌లో ఉన్న మా ఆంటీ కోసం అత్యవసరంగా ఆక్సిజన్ సిలిండర్ కావాలి. ఆమె వయసు 65ఏండ్లు. ఆమె తీవ్ర ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో హాస్పిటల్లో ఉంది’ అంటూ సురేశ్ రైనా ట్వీట్ చేశాడు. రైనా ట్వీట్‌కు వెంటనే స్పందించిన సోనూ సూద్..10 నిమిషాల్లోనే ఆక్సిజన్ సిలిండర్ అక్కడికి చేరుకుంటుంది భాయ్ అంటూ రిప్లై ఇచ్చాడు.