తెలుగులో రప్ఫాడిస్తాడు


Sun,July 21, 2019 12:55 AM

తెలుగు రాష్ర్టాల్లో పుట్టి.. తెలుగువారయి ఉండి.. తెలుగులో పట్టుమని పది మాటలు కూడా మాట్లాడటం రాని వారు కోకొల్లలుగా ఉన్నారు. అలాంటిది ఎక్కడో అమెరికాలో పుట్టి పెరిగి.. ఉపాధి కోసం వచ్చిన అమెరికన్.. తెలుగు భాషలో ఇరగదీస్తున్నాడు. అక్షరం తప్పు పోకుండా తెలుగులో అనర్గళంగా మాట్లాడుతూ.. అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు.
american-man
తెలుగులో స్పష్టంగా మాట్లాడుతున్న ఈ అమెరికన్ పేరు రిచర్డ్స్. అమెరికాలో మోంటానాలోని హేగన్ డాజ్ ఐస్‌క్రీమ్ షాపులో పనిచేస్తున్నాడు. ఇతను రెండేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాల్లో పనిచేశాడు. మొదట విశాఖపట్టణానికి వెళ్లిన రిచర్ట్స్.. ఆ తర్వాత విజయవాడ, హైదరాబాద్ నగరాల్లో పలు ఉద్యోగాలు చేశాడు. మొదట్లో తెలుగు రాక చాలా ఇబ్బందులు పడిన ఇతను.. తర్వాత తెలుగు నేర్చుకున్నాడు. తన సహోద్యోగుల సహకారంతో తెలుగులో మాట్లాడడం ప్రారంభించాడు. ఎప్పుడు ఎవరితోనైనా తెలుగులో అనర్గళంగా మాట్లాడుతూ.. అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. రిచర్డ్స్ ప్రవర్తన, అతని తెలుగు మాట్లాడే విధానం మనోళ్లకు తెగ నచ్చేసింది.

అమెరికాలో ఓ రోజు నేను పనిచేస్తున్న ఐస్‌క్రీమ్ షాపు వద్ద కొందరు తెలుగులో మాట్లాడటం కనిపించింది. నేను వారితో తెలుగులోనే మాటలు కలిపాను. వాళ్లు నేను తెలుగు మాట్లాడటం చూసి ఆశ్చర్యపోయారు. వారు ఎందుకు అంత ఆశ్చర్యపోయారు..? అన్నది నాకు మొదట్లో అర్థం కాలేదు. నేను వారితో మాట్లాడుతుంటే.. ఒకరు వీడియో తీసి ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. అది వైరల్ అవడం.. దానికొచ్చిన రెస్పాన్స్ చూసి షాకయ్యా. ప్రస్తుతం నా ఫేస్‌బుక్ పేజీలో నా వీడియోలు పెట్టాను. మీరూ ఫాలో అవ్వండి అంటూ రిచర్డ్స్ కోరాడు. రిచర్డ్స్ వీడియో పెట్టిన కొద్ది రోజుల్లోనే 3లక్షలకుపైగా వ్యూవ్స్ వచ్చాయి. అతడిని ప్రశంసిస్తూ వేలాది కామెంట్స్ చేస్తున్నారు. వారిలో సినీనటి మంచు లక్ష్మి కూడా ఉన్నారు.

411
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles