వినూత్న విద్యాబోధన


Mon,June 17, 2019 12:14 AM

దేశాభివృద్ధి ఆ దేశ జనాభా అక్షరాస్యతపై ఆధారాపడి ఉంటుంది. నాణ్యమైన విద్యను అందించేందుకు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎమ్) కోల్‌కతాకు చెందిన పరిశోధకులు శ్రీకారం చుట్టారు. ప్రత్యేకంగా ఎడ్యూటెక్ స్టార్టప్‌ను రూపొందించి వినూత్నంగా విద్యాబోధన చేస్తున్నారు.
research--education
ప్రాథమిక పాఠశాలల్లో చదివే కొంతమంది విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదు. దానివల్ల వారు చదువులో రాణించలేకపోతున్నారని 2018 వార్షిక విద్యా నివేదికలో వెల్లడైంది. భారతదేశంలో గ్రామీణ, పట్టణాల్లోని పలు పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ముగ్గురు టెకీలు ముందుకొచ్చారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ కోల్‌కతాకు చెందిన ప్రియదర్శిణి, జయంతబాసక్, అరీనా బర్ధన్ అనే ముగ్గురు పరిశోధకులు నేటి విద్యా వ్యవస్థలోని లోపాలపై అధ్యయనం మొదలుపెట్టారు. అందుకు పశ్చిమబెంగాల్‌లోని గ్రామాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను ఎంచుకున్నారు. పలు స్కూళ్లలో ఉపాధ్యాయులు లేకపోవడం, ఒకవేళ ఉపాధ్యాయులున్నా సమయానికి హాజరుకాకపోవడం, టీచర్లకు సరైన అవగాహన లేకపోవడం వంటి అంశాలుగా తేల్చారు. నాణ్యమైన విద్యనందించేందుకు ఈ-లెర్నింగ్ విధానమే సరైన పరిష్కారమని తేల్చారు. 30మంది విద్యార్థులకు ఆరు నెలలు ప్రయోగాత్మకంగా ఆన్‌లైన్‌లో పాఠాలు చెప్పారు. ఇదే ప్రాజెక్టును పశ్చిమబెంగాల్‌లోని నాలుగైదు చోట్ల ప్రవేశపెట్టారు. మంచి ఫలితాలొచ్చాయి. ఈ ప్రాజెక్టు ద్వారా టెకీలు అనుకున్నట్లుగా విజయాన్ని సాధించారు. 2017లో ఆ ప్రాజెక్టుకు కనెక్ట్ అని పేరు పెట్టారు. ఆన్‌లైన్ ద్వారా గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా విద్యనందిస్తున్నారు. సామాన్య, గణితశాస్త్రం, ఆంగ్లం సబ్జెక్టుల్లో నిష్ణాతులైన 30మం ది ఉపాధ్యాయులతో విద్యను అందించే ప్రయత్నం చేస్తున్నారు.

727
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles