ఎనర్జీ డ్రింకులతో గుండెకు చిల్లు!


Mon,June 17, 2019 12:12 AM

ఎనర్జీ డ్రింక్స్ వల్ల లాభాల మాట అటుంచితే నష్టాలే ఎక్కువగా ఉన్నాయట. తక్షణ ఎనర్జీ కోసం తాగండి అంటూ రూ.50 నుంచి, వెయ్యి వరకు డ్రింక్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. ఇవి తాగడం వల్ల ఆరోగ్యానికి హాని ఎలా జరుగుతుందో చూద్దాం.
energyDrinks
-ఎనర్జీ డ్రింక్స్ తాగితే శరీరంలో రక్తపోటు స్థాయి విపరీతంగా పెరిగిపోతుంది. హృదయ స్పందనల్లో తీవ్ర మార్పులు చోటు చేసుకుంటాయి. ఎనర్జీ డ్రింక్స్‌లో కలిపే రసాయనాల వల్ల గుండెకు హాని జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు.
-ఎనర్జీ డ్రింకుల్లో కలిపే 304 నుంచి 320 గ్రాముల కెఫైన్ మెదడును ఉత్తేజితం చేస్తుంది. ఈ కారణంగా ఎనర్జీ డ్రింక్ తాగిన వెంటనే బలం పెరిగిన భావన వస్తుంది. కానీ ఆ బలం కొద్దిసేపు మాత్రమే ఉంటుందన్న విషయం గ్రహించాలి.
-ఎనర్జీ డ్రింకుల్లో కలిపే రసాయనాల వల్ల భవిష్యత్‌లో గుండెజబ్బులు, నరాల బలహీనత సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు అమెరిర్సిటీ ఆఫ్ పసిఫిక్ సైంటిస్టులు ఒక పరిశోధనలో తెలిపారు.
-టీనేజర్స్ ఈ డ్రింకులను తాగడం వల్ల వారి శారీరక ఎదుగుదల ఆగిపోతుంది. ప్రతి రోజు ఈ డ్రింక్స్ తాగే పిల్లలు స్థూలకాయం, మధుమేహం వంటి అనారోగ్య సమస్యలతో బాధపడతారు. ముఖ్యంగా పిల్లల్లో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది.
-వృద్ధులు ఎనర్జీ డ్రింక్స్ తాగడం వల్ల వారి జీర్ణక్రియ మందగిస్తుంది. వాంతులు వికారం కలిగే అవకాశం ఉంది. రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. ప్రతిరోజు ఈ డ్రింక్ సేవించే వృద్ధులు తరచూ అనారోగ్యం పాలవుతుంటారు. వీలైనంత వరకు పిల్లలు, వృద్ధులు ఈ డ్రింక్స్‌కు దూరం ఉండడమే. మంచిది.

1416
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles