21 యేండ్లకే 196 దేశాలు చుట్టేసింది


Sun,June 16, 2019 01:38 AM

ప్రపంచ దేశాలన్నీ చుట్టేయాలని అందరికీ ఉంటుంది. అదృష్టం మాత్రం కొందర్నే వరిస్తుంది. అలాంటి ఓ యువతి చిన్న వయసులోనే ప్రపంచ దేశాలను చుట్టేసింది. అంతేకాదు గిన్నిస్ రికార్డును కూడా బ్రేక్ చేసింది.
Lexie-Alford
లెక్సీ అల్ఫోర్డ్ అమెరికాలోని కాలిఫోర్నియాకి చెందిన 21 ఏళ్ల యువతి. లెక్సీ పేరెంట్స్‌కి కాలిఫోర్నియాలో ఓ ట్రావెల్ ఏజెన్సీ ఉంది. లెక్సీ చిన్నప్పటి నుంచి ప్రపంచ దేశాలన్నీ చూడాలని కోరిక. వారికి ట్రావెల్ ఏజెన్సీ ఉండడంతో ఆలస్యం చెయ్యకుండా ప్రపంచ యాత్ర మొదలుపెట్టింది. 2016 నుంచి సార్వభౌమత్వం ఉన్న దేశాల్లో పర్యటించేందుకు బయలెల్లింది. ఈ ఏడాది మే 31న లెక్సీ ఉత్తర కొరియాలో అడుగుపెట్టింది. తద్వారా సార్వభౌమత్వం ఉన్న ప్రతీ దేశాన్నీ చుట్టిన అతి చిన్న వయస్కురాలిగా లెక్సీ చరిత్ర సృష్టించింది. ఇదివరకు యూకేకి చెందిన జేమ్స్ అస్క్విత్ పేరున ఈ రికార్డ్ ఉండేది. ఆయన కూడా 24 ఏళ్ల వయసులో 192 రోజుల్లో సార్వభౌమత్వ దేశాలన్నీ చుట్టేశాడు. ప్రపంచ దేశాలన్నీ చుట్టినట్లుగా ఓ అధికారిక నేమ్ ప్లేట్‌ను తన ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసింది లెక్సీ అల్ఫోర్డ్. ఏళ్ల తరబడి తాను పడిన కష్టానికీ, ప్రపంచమంతా తిరిగినందుకూ తనకు తగిన గుర్తింపు వచ్చిందని తెలిపింది లెక్సీ.

తనకు సాయం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపింది లెక్సీ. తన జీవితంలో అతి పెద్ద అధ్యాయం దాదాపు పూర్తవుతోందన్న లెక్సీ.. కొత్త ప్రయాణం మొదలవుతున్నందుకు సంతోషంగా ఉందని తెలిపింది. ఫోబ్స్ ప్రకారం లెక్సీ ప్రయాణాలన్నింటికీ తన పేరెంట్స్ నిర్వహిస్తున్న ట్రావెల్ ఏజెన్సీయే పూర్తి జాగ్రత్తలు తీసుకొని ఈ విజయం సాధించేలా చేసింది. 21 ఏళ్లకే ఎన్నో అనుభవాలు, అనుభూతులను సొంతం చేసుకుంది లెక్సీ.

3127
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles