సేకరించేటప్పుడు పాతవి.. కొనుగోలు చేసేటప్పుడు కొత్తవి!


Mon,April 1, 2019 03:44 AM

ఒకప్పుడు బట్టలంటే ఒంటి మీద ఒకటి తీగ మీద ఒకటి ఆరేసుంటుంది. ఇప్పుడు పండగ, పబ్బంతో సంబంధం లేకుండా బట్టలు కొనుగోలు చేసి వార్డ్‌రోబ్‌లో పడేస్తున్నారు. అందులో వాడకుండా ఉండేవి చాలా ఉంటాయి. వృథాగా ఉన్న దుస్తులను సేకరించి వాటిని రీమోడలింగ్ చేసి పేద ప్రజలకు అందజేస్తున్నదో మహిళ.
Sujata-Chatterjee
కలకత్తాకి చెందిన సుజాత ఛటర్జీ ఈ-కామర్స్ వెబ్‌సైట్ ప్రారంభించినది. www.twirl.store వెబ్‌సైట్‌లో బట్టలు, బ్యాగులు, కొనుగోలు చేయొచ్చు. ఇవన్నీ పాత బట్టల్ని రీసైకిల్ చేసి తయారు చేసినవి కావడం విశేషం. ఒకప్పుడు దీపావళి, దుర్గాపూజ, న్యూ ఇయర్‌కి కొత్త బట్టలు కొనుగోలు చేసేవారు. ఇప్పుడు పండుగలతో సంబంధం లేకుండా పోయింది. ఇంట్లోని వార్డ్‌రోబ్‌లు దుస్తులతో నిండి ఉంటుంది. అందరింట్లోలాగానే సుజాత ఇంట్లో కూడా వార్డ్‌రోబ్ బట్టలతో నిండినది. చాలామంది బట్టలు కొనలేక చినిగిపోయిన బట్టలతో రోడ్డుమీద నడుస్తుంటారు. అందరి దగ్గర వృథాగా ఉన్న బట్టల్ని పేద ప్రజలకు అందించాలనుకున్నది. అందుకు ట్విర్ల్ స్టోర్ ఈ-కామర్స్ వెబ్‌సైట్ సరైందనుకున్నది. దాతల నుంచి పాత బట్టలు, ఫ్యాబ్రిక్స్‌ను ట్విర్ల్ సేకరిస్తుంది. వీటిని కొత్త బట్టలుగా తీర్చిదిద్ది పేద ప్రజలకు అందజేస్తున్నది సుజాత. ఊరికే పాత బట్టలు ఇవ్వనవసరం లేదంటుంది సుజాత. పాత బట్టలు అందజేసిన వారికి రివార్డుని అందిస్తున్నది. కలకత్తాలోని అన్ని ఏరియాలో ట్విర్ల్ బాక్సులు పెట్టింది. అందుబాటులో ఉన్న బాక్సుల్లో బెడ్‌షీట్స్, టేబుల్‌క్లాత్స్ ఏవైనా అందులో వేసి రివార్డుని అందుకోవచ్చు. పాత దుస్తుల్ని రీమోడలింగ్ చేయడానికి పశ్చిమ బెంగాల్‌కి చెందిన 60 మంది మహిళలను పనిలో పెట్టింది సుజాత. సంచులు, దుస్తులు, ఆఫీసుకి సంబంధించిన స్టేషనరీస్‌నీ రూపొందిస్తారు. 2017 నుంచి ఇప్పటివరకు 3500 బట్టలతో 10,000కి పైగా ప్రొడక్ట్స్ తయారుచేసింది. అందులో 1500కి పైగా వస్త్రాలను పేద ప్రజలకు అందజేసినది. ట్విర్ల్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఎన్‌జీఓలతో పనిచేస్తున్నది.

756
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles