మైగ్రేన్.. పరిష్కారం?


Mon,April 27, 2015 12:32 AM

mind


మైగ్రేన్ ఒక దీర్ఘకాలికమైన తలనొప్పి. ఇది ఓ మోస్తరు నుంచి తీవ్రస్థాయిలో ఉంటుంది. తలలో సగభాగం మాత్రమే నొప్పి ఉండి, ఈ నొప్పి వల్ల తల అంతా కంపిస్తున్నట్టుగా ఉంటుంది. 2 నుంచి 72 గంటల వరకు ఈ బాధ ఉంటుంది. నొప్పితో పాటు వికారం, వాంతులు, కాంతిని చూడలేకపోవడం, చిన్న శబ్దాన్నయినా భరించలేకపోవడం, వాసనలు పడకపోవడం లాంటి లక్షణాలుంటాయి. సాధారణంగా ఏదైనా శారీరక శ్రమ చేస్తే నొప్పి తీవ్రం అవుతుంది. మూడొంతుల మందిలో ఆరా కనిపిస్తుంది. చాలక నాడుల డిస్ట్రబెన్సెస్ కూడా ఉంటాయి.

కారణం


మైగ్రేన్‌కి చాలావరకు మానసికమైన పరిస్థితులే కారణమవుతాయి. డిప్రెషన్, ఆందోళన, బైపోలార్ డిజార్డర్ లాంటివి పార్శపు నొప్పిని ప్రేరేపిస్తాయి.

లక్షణాలు, సంకేతాలు


-ప్రోడ్రోమ్ దశ - ఇది తలనొప్పికి కొన్ని గంటలు లేదా రోజుల ముందు ఉంటుంది. మూడ్ మారిపోవడం, చికాకు, డిప్రెషన్, అలసట, కొన్ని రకాల ఆహారంపై తీవ్రమైన ఇష్టం, మెడ కండరాలు పట్టేయడం, మలబద్దకం లేదా విరేచనాలు, శబ్దం, వాసన పడకపోవడం లాంటి లక్షణాలు ఆరాతో పాటు లేదా ఆరా లేకుండా కనిపిస్తాయి.

ఆరా దశ - ఇది మొదలైన వెంటనే తలనొప్పి వస్తుంది. తలనొప్పి ఉన్నప్పుడు కూడా ఆరా ఉంటుంది. తలనొప్పి లక్షణాలు మొదలవడానికి ముందుగాని, మొదలైన తరువాత గాని ఈ దశ ఉంటుంది. కళ్లెదురుగా మిరుమిట్లు గొలుపుతున్నట్టుగా, చీకటి మచ్చల్లాగ కనిపిస్తుంటుంది. దృష్టిలో డిస్ట్రబెన్స్ ఉంటుంది. చదవడం, వాహనం నడిపే సామర్థ్యంపై ప్రభావం చూపిస్తుంది. సాధారణంగా ఈ మార్పులు దృష్టి కేంద్రం దగ్గర మొదలై జిగ్‌జాగ్ గీతలుగా వ్యాపిస్తాయి. కొందరిలో ఈ గీతలు తెలుపు నలుపుగా ఉంటే, కొందరికి రంగులుగా కూడా ఉంటాయి.

ఒక చేతి వైపు సూదులతో గుచ్చుతున్న భావన ఉంటుంది. ఇది నోరు, ముక్కు భాగం వైపు వ్యాపిస్తుంది. సాధారణంగా మొద్దుబారినట్టుగా కూడా ఉంటుంది. మాట్లాడడంలో కూడా తేడాలు వస్తాయి. చెవుల్లో ఏవో శబ్దాలు వినబడుతున్నట్టుగా అనిపిస్తుంది.

నొప్పి దశ - ఇది తలనొప్పి దశ. నొప్పితో పాటు, వికారం, వాంతులు, నీరసం, చికాకు, శబ్దం, వాసనలు పడకపోవడం లాంటి వాటితో పాటు నాడీ సంబంధ సమస్యలు కూడా ఉంటాయి. తల తేలికైపోతున్నట్టుగా ఉంటుంది. గందరగోళంగా ఉంటారు. దృష్టిలో సమస్యలు, ముక్కు పట్టేసినట్టుండడం, పదే పదే మూత్ర విసర్జన, చెమట, తల భాగంలో వాపు, మెడ పట్టేయడం లాంటి లక్షణాలుంటాయి.

పోస్ట్‌డ్రోమ్ దశ - ఇది మైగ్రేన్ చివరి దశ. బాగా నీరసంగా ఉంటారు. కాగ్నిటివ్ ఇబ్బందులుంటాయి. జీర్ణ సమస్యలు కనిపిస్తాయి.

మైగ్రేన్ రకాలు


-ఆరా లేకుండా మైగ్రేన్ : ఆరా దశ లేకుండా వచ్చే మైగ్రేన్ తలనొప్పి
-ఆరాతో కూడిన మైగ్రేన్ : సాధారణంగా ఆరా దశతో కూడిన తలనొప్పి ఉంటుంది.
-అబ్డామినల్ మైగ్రేన్ : పదే పదే కడుపునొప్పి రావడం వల్ల వచ్చే మైగ్రేన్
-రెటినల్ మైగ్రేన్ : దృష్టి సమస్యలు లేదా తాత్కాలిక అంధత్వంతో కూడిన తలనొప్పి

geetha

మైగ్రేన్ లాంటి ఇతర సమస్యలు


-టెన్షన్ తలనొప్పి : తలకు రెండు పక్కల నొప్పి ఉంటుంది.
-క్లస్టర్ తలనొప్పి : ఒకవైపు ముక్కు పట్టేయడం, కళ్లలో నీరు రావడం, తీవ్రమైన నొప్పి
-టెంపోరల్ ఆర్టరైటిస్ : 50 ఏళ్లు పైబడిన వాళ్లలో ఎక్కువ.

మైగ్రేన్ తలనొప్పులకు హోమియోపతి మంచి పరిష్కారం చూపిస్తున్నది. జెనెటిక్ కాన్‌స్టిట్యూషనల్ థెరపీ ద్వారా ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా మైగ్రేన్‌ను తగ్గించడం చాలా సులభం.

3468
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles