91 ఏళ్లకు డిగ్రీ పట్టా!


Sun,August 13, 2017 01:21 AM

చదువాలని మనసు ఉండాలే కానీ.. దానికి వయసుతో పనిలేదని నిరూపించిందీ బామ్మ. 91ఏళ్ల వయసులో చదువు పై ధ్యాస పెట్టి డిగ్రీ పట్టా సంపాదించింది.
degree
పెద్దలు కష్టపడి చదువమని పంపిస్తే.. కాలేజీలు ఎగ్గొట్టి, పరీక్షలు ఫెయిలయి పోతున్నారు చాలామంది. కానీ పట్టుదల ఉంటే పరీక్షల్లో పాసై పోవచ్చు అని తన రిజల్ట్‌తో చూపించింది కిమ్లన్ జినకుల్. ఈమె వయసు ఇప్పుడు 91 సంవత్సరాలు. కృష్ణా రామా అంటూ కూర్చునే వయసులో ఆమె పట్టుదలతో చదివి పరీక్షలు రాసింది. కాకపోతే అన్ని సబ్జెక్టులు పాసవడానికి మాత్రం పది సంవత్సరాల కాలం పట్టిందనుకోండి. ఇన్ని సంవత్సరాలు పట్టడానికి కారణం కూడా లేకపోలేదు. వయసుతో పాటు వచ్చే అల్జీమర్స్ ఆమెను బాధిస్తున్నా చదువు మీద ఉన్న ఆసక్తి ఆ అల్జీమర్స్‌ని అధిగమించి హ్యూమన్ అండ్ ఫ్యామిలీ డెవలప్‌మెంట్ బ్యాచిలర్ డిగ్రీలో పట్టా సంపాదించింది. థాయిలాండ్‌కి చెందిన ఈ బామ్మకి చదువంటే ప్రాణం. కానీ యుక్త వయసులోనే పెండ్లయిపోయింది. ఆ తర్వాత కుటుంబ బాధ్యతలతో చదువుకు ఫుల్‌స్టాప్ పడింది. మొత్తానికి ఇప్పటికి తన కల నెరవేరింది.

297
Tags

More News

VIRAL NEWS