65 మందిని కాపాడింది!


Fri,November 30, 2018 11:24 PM

ఆమె ఎప్పటిలాగే ఆ హోటల్‌లో బ్యాంకెట్ మేనేజర్‌గా విధులకు హాజరైంది. తానున్న గదిలో 65 మందితో ఓ సమావేశం జరుగుతున్నది. ఒక్కసారిగా బాంబుల శబ్దం. ఎవరో సంబురాలు చేసుకుంటున్నారని అంతా ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారు. ఈసారి వరుసగా బాంబుల వర్షం. చూస్తే.. ఉగ్రవాదులు అందర్నీ కాల్చి చంపుతున్నారు. ఆ బ్యాంకెట్‌లో ఉన్న వారిని కాపాడేందుకు మేనేజర్ ఏం చేసిందంటే..?

banquet-manager
దేశంలోనే అతి భయంకరమైన రోజు 2008 నవంబర్ 26. ముంబైలోని తాజ్ హోటల్లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటన అది. ఆ సమయంలో తాజ్‌మహల్ ప్యాలెస్ హోటల్లో మేనేజర్‌గా పని చేస్తున్న మల్లికా జగద్ 65 మందితో సమావేశం జరుగుతుండగా అక్కడే ఉంది. ఆ సమయంలో బాంబు పేలుడు శబ్దాలు వినిపించాయి. మామూలుగా ఏదో సంబరాలు జరుగుతున్నాయనుకున్నారు. మరికొద్ది సేపటి తర్వాత మరోమారు బాంబుల శబ్దాలు వినిపించాయి. ఓ పక్క అక్కడున్న వారందరికీ ఫోన్‌కాల్స్, మెసేజ్‌లు నిరాటంకంగా వస్తూనే ఉన్నాయి. వారందరికీ ఎలావున్నారు? ఏమీ ప్రమాదం లేదు కదా? అనే ప్రశ్నలతో కూడిన కాల్స్, మెస్సేజ్‌లవి. ఒక్కసారిగా భారీ పేలుళ్ల శబ్దంతో అక్కడి వారంతా గడగడలాడిపోతున్నారు. ఆ సమయంలో మల్లికా జగద్ చాకచక్యంగా వ్యవహరించి తనతోపాటు మరికొంత మంది ప్రాణాలను కాపాడగలిగింది. ఉగ్రవాదులు తమ గదిలోకి చొరబడకుండా ముందుగా గదిలో ఉన్న లైట్లన్నీ ఆపివేసింది. లోపలి నుంచి తలుపులు మూసింది. అందర్నీ నిశబ్దంగా ఉండమని కోరింది. అలా ఆ రాత్రంతా ఉగ్రవాదుల చెరలోనే ఉండి వారి కంటపడకుండా భయాందోళనలకు గురవుతూనే ఆ గదిలోనే గడిపారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయంతోపాటు కంటి మీద కునుకు లేకుండా వారంతా అలాగే ఉన్నారు. తెల్లవారిన తర్వాత టాటా ట్రస్ట్ ఏర్పాటు చేసిన విపత్తుల నివారణ బృందం సాయంతో అందరినీ సురక్షితంగా రక్షించగలిగింది. అలా తన ధైర్యసాహసాలతో చాకచక్యంగా వ్యవహరించింది.

725
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles