350 రకాల పండ్ల మొక్కలు


Sat,July 28, 2018 01:39 AM

అనీష 350 రకాల పండ్ల మొక్కలను పెంచుతున్నది. వాటిని సొంత బిడ్డల్లా చూసుకుంటున్నది. అవి తన జీవితంలో తీపి జ్ఞాపకాలుగా మిగులుతున్నాయి అంటున్నది అనీష . ఇప్పుడు ఆ బాధ్యతను ఆమె బిడ్డలు తీసుకొని రకరకాల మొక్కలు పెంచుతున్నారు.
aneesha
చాలమంది పండ్ల చెట్లను వ్యాపారానికి లేదా ఇంట్లో అవసరాలకి కొన్ని చెట్లని పెంచుతారు. కానీ కేరళకు చెందిన అనీష ఉతమాన్ ఏకంగా 350కి పైగా రకారకాల పండ్ల చెట్లను పెంచుతున్నది. అన్ని చెట్లు పెంచుతుందంటే కచ్ఛితంగా వ్యాపారానికి అనుకొంటారు చాలామంది. అలా అనుకొంటే పొరపాటే. రకరకాల పండ్లచెట్లను పెంచడం అంటే అనీషకు ఎంతో ఇష్టమట. అనిష 60 రకాల మిరపకాయలు, ముప్పై రకాల తులసి చెట్లు, పది రకాల కలబంద చెట్లు, 20 రకాల నిమ్మచెట్లను పెంచుతుందని చెప్పుకొచ్చింది. వాటికి ఎరువుగా ఆవు, మేక వంటి జంతువుల నుంచి వచ్చే పేడను ఉపయోగిస్తున్నారు. ఎక్సోటికా పండ్లు అంటే కాటంఫె, రొలినియ డెలిసియోస, అరమాయి, మంగోస్టీన్, పులసాన్, డైరియన్, చమాలియాంగ్, బెర్సిస్ ద్రాక్ష, స్నేక్ పండ్లు, ఇలా చాలా పండ్లను పండిస్తున్నది. ఈ చెట్లన్నీ అనీషకు కన్న బిడ్డల వలె విడదీయలేని బంధంగా మారిపోయాయని చెప్పుకొచ్చింది. వీటిని చూడడానికి ఎవరైనా వచ్చి, రుచిచూసి కావాలంటే తీసుకెళ్లొచ్చు అని చెప్తున్నది. అనీష తరువాత తన పిల్లలు చెట్ల బాధ్యతలను చేపడుతూ మొక్కలపై ప్రేమ చాటుతున్నారు.

997
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles