18 లక్షలకే ఫ్లాట్


Sat,September 22, 2018 01:12 AM

JANAPRIYA
హైదరాబాద్‌లో అందుబాటు ధరలో ఫ్లాట్లు అంటే ముందుగా గుర్తుకొచ్చేది జనప్రియ ఇంజినీర్సే. ఈ సంస్థ తాజాగా 2,100 ఫ్లాట్లను నిర్మిస్తోంది. సైనిక్‌పురిలో లేక్‌ఫ్రంట్ ప్రాజెక్టును ఐదు ఎకరాల్లో కడుతుండగా.. సితారను ఏడు ఎకరాల్లో చేపట్టింది. లేక్‌ఫ్రంట్ విషయానికొస్తే.. నాలుగు బ్లాకుల్లో తొమ్మిది వందల ఫ్లాట్ల నిర్మాణమిది. ఇందులో రెండు బ్లాకులు పూర్తి కాగా.. 350 మంది కొనుగోలుదారులు నివసిస్తున్నారు. మరో రెండు బ్లాకుల్లో, ఒకటి నిర్మాణం చివరి దశలో ఉంది. ఇందులో కూడా 180 ఫ్లాట్లలో 130 అమ్మకాలు పూర్తి కావడం విశేషం. ఫ్లాట్ల విస్తీర్ణం.. 800 నుంచి 1200 చదరపు అడుగుల్లో కడుతున్నారు. చదరపు అడుక్కీ రూ.2,700 చెబుతున్నారు. అంటే, ఒక్కో ఫ్లాటు ధర.. రూ.24 లక్షల నుంచి రూ.36 లక్షల దాకా ఉంటుంది. నిర్మాణంలో ఉన్న బ్లాకును 2019 మే లోపు పూర్తి చేయడానికి జనప్రియ సన్నాహాలు చేస్తోంది.

1200 ఫ్లాట్ల.. సితార

ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీము కింద ఫ్లాట్లను కొనుగోలు చేయాలని భావించేవారికి అతికినట్లు నప్పే ప్రాజెక్టే.. సితార. ఇందులో ఫ్లాట్ కొనుగోలు చేస్తే పీఎంఏవై పథకం కింద సుమారు రూ.2.35 లక్షల నుంచి రూ.2.60 లక్షల దాకా వడ్డీ రాయితీ లభిస్తుంది. సుమారు ఏడు ఎకరాల్లో 1200 ఫ్లాట్ల ప్రాజెక్టు ఇది. 580 నుంచి 850 చదరపు అడుగుల్లో ఫ్లాట్ల సైజులున్నాయి. ఒక్కో ఫ్లాట్ ధర రూ.18 లక్షల నుంచి ఆరంభమవుతుంది. ఇప్పటికే మూడు బ్లాకుల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మొదటి బ్లాకును 2019 డిసెంబరులోపు పూర్తి చేయడానికి సంస్థ సన్నాహాలు చేస్తోంది.

3230
Tags

More News

VIRAL NEWS