15 యేండ్లుగా ఒకే సర్పంచ్!


Wed,August 1, 2018 01:41 AM

మహిళలకు నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే పరిపాలన ఏ విధంగా పరుగులు తీస్తుందో ఈమెను చూసి నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఆ గ్రామానికి 15 యేండ్లుగా ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నికవుతూ.. ఊరిని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నది.
Womens-Village
గుజరాత్ రాష్ట్రంలోని గిర్ జిల్లా, బాదల్‌పరా గ్రామంలో మహిళలదే అధికారం. ఆ గ్రామంలో మగవారు కూడా అడ్డు తగిలి అధికారం కోసం పోటీకి రారు. ఎందుకంటే, వారు చేస్తున్న అభివృద్ధే అందరికీ శ్రీరామ రక్ష. వార్డు మెంబర్ దగ్గర్నుంచి, ఉపసర్పంచ్, సర్పంచ్ వరకూ అంతా మహిళలే. ఈ అనూహ్యమైన మార్పునకు కారణం రమా పంపానియా. 2005 నుంచి సర్పంచ్‌గా తానే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా తానే సర్పంచ్ అభ్యర్థి కూడా. ఈ గ్రామం అభివృద్ధికి మారుపేరు. డ్రెయినేజీ వ్యవస్థ, రోడ్ల నిర్మాణం, విద్యుత్ నిర్వహణ, వై-ఫై, పచ్చదనం-పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణ.. ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని విభాగాల్లోనూ అభివృద్ధే కనిపిస్తుంది. ఈ గ్రామంలో రోడ్ల మీద ఎవ్వరూ చెత్త, ఉమ్మి వేయరు. ఎవరైనా అతిక్రమిస్తే జరిమానా విధిస్తారు. సర్పంచ్ సహా వార్డు మెంబర్లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడాన్ని సమ్రస్ గ్రామాలంటారు. ఈ జాబితాలో 15 యేండ్ల నుంచి బాదల్‌పరా ఉన్నది. కారణం, మహిళా నాయకులు, గ్రామస్తుల సహకారం. మహిళలు అధికారం చేపట్టినప్పటి నుంచి వారు తీసుకునే వేగవంతమైన నిర్ణయాల కారణంగా ఊరిలో అభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయని, స్వచ్ఛమైన పాలనపై వారికి మంచి అవగాహన ఉందని స్థానికులు చెబుతున్నారు.

891
Tags

More News

VIRAL NEWS