140 కి.మీ. చాలెంజ్!


Tue,August 21, 2018 11:00 PM

మనిషికి పుట్టుక ఒక్కటే.. చావు కూడా ఒక్కటే. అలాంటిది ఒక్క కన్ను ఉంటే మాత్రం.. ఆత్మవిశ్వాసం కోల్పోవాలా? అంటూ ఆత్మవిశ్వాసానికే చాలెంజ్ విసిరి లొంగదీసుకుంది దివ్య.
divya
అంతకు ముందు ఆమెకు పెద్దగా మారథాన్‌లలో పాల్గొన్న అనుభవం లేదు. కానీ ఒక లక్ష్యం కోసం అడుగులు వేయాలనుకున్నది. తన పరుగు ద్వారా ఆ లక్ష్యాన్ని చేరాలనుకున్నది. పుట్టుకతోనే ఒక కంటిచూపును కోల్పోయినా.. గుండెల నిండా ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కోల్పోలేదు దివ్య. పేరులోనే దివ్య అని పెట్టుకున్న ఆమెకు దివ్యాంగులు క్యాన్సర్ అవగాహన కోసం చేపట్టిన పింకథన్ బాగా నచ్చింది. ఎలాగైనా తన వంతుగా ఆ కార్యక్రమంలో పాల్గొనాలనుకున్నది. కానీ.. తాను చెప్పాలనుకున్న విషయం ముందుగా అందరికీ చెప్పాలని నిర్ణయించుకున్నది. అందుకే.. ద స్పిరిట్ ఆఫ్ పింకథన్ రన్ పేరుతో పాండిచ్చేరి నుంచి చెన్నై వరకు 140 కిలోమీటర్లు మారథాన్ చేయాలనుకున్నది. పింకథన్ కంటే ముందే ఈ మారథాన్ పూర్తి చేసి పింకథన్ మీద అవగాహన కల్పించాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నది.


ఇందుకు మిలింద్ సోమన్ దగ్గర రెండు నెలలపాటు శిక్షణ పొందింది. ఈ శిక్షణ కోసం ఆమె అతనిని సంప్రదించలేదు. సోషల్ మీడియా ద్వారా విషయం తెలుసుకున్న మిలింద్ సొమన్ ఆమె దగ్గరికి వచ్చి నెలన్నర పాటు దివ్యకు మారథాన్‌లో పాటించాల్సిన విషయాలతో పాటు పలు అంశాల్లో శిక్షణ ఇచ్చాడు. మానసిక వికాస తరగతులు బోధించాడు. ఆగస్టు 2న మారథాన్ మొదలుపెట్టిన దివ్య 4న పూర్తి చేసింది. పరుగులు తీసే క్రమంలో.. ఎంతోమంది చూపు తన వైపు తిప్పుకోగలిగింది. పింకథన్ లక్ష్యాన్ని ఎన్నో లక్షల హృదయాలకు చేర్చగలిగింది. ఇంత చేసినా ప్రచారానికి దూరంగా ఉండే దివ్యకు సోషల్ మీడియా ఇప్పడు జయహో.. దివ్య అంటున్నది.

468
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles