ఆ రేంజ్ పండు


Mon,July 24, 2017 01:04 AM

నారింజ పండు అందరికీ ఇష్టమే. ఇంతకీ ఆరెంజ్‌లో ఉండే ఆ రేంజ్ గుణాలేమిటో తెలుసా?
orange
-రోజుకో నారింజ పండును తింటే మతి మరుపును దూరం చేసుకోవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.
-తరుచూ ఆరెంజ్ జ్యూస్‌ను తాగడం వల్ల కిడ్నీల్లో ఏర్పడే రాళ్లను కరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి. దీనితో శరీరంలో కొవ్వును తగ్గించుకుని, వ్యాధి నిరోధక్తిని పెంచుకోవచ్చు.
-నీటిశాతం ఎక్కువగా కలిగిన ఆరెంజ్ ఫ్రూట్స్.. శరీరాన్ని డీ హైడ్రేట్ కాకుండా కాపాడుతుంది. నోటి దుర్వాసన పొగొట్టే గుణం ఈ పండులో ఉంటుంది.
-ఆకలి తక్కువగా ఉండేవారు రెగ్యులర్‌గా నారింజ పండు తినడం మంచిది. దీనిలో ఉండే లాక్టిక్ యాసిడ్ అజీర్తి సమస్యలను దూరం చేస్తుంది.
-గుండె సంబంధిత వ్యాధులను నియంత్రించడంలో నారింజ పండు మంచి ఔషధంలా ఉపయోగపడుతుంది. అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది.

485
Tags

More News

VIRAL NEWS