ఈ సమస్య తీరేదెలా?


Wed,January 31, 2018 11:58 PM

మా నాన్నగారి వయసు 68 సంవత్సరాలు. ఆయనకి ఇప్పటివరకు షుగర్, బి.పి. వంటి వ్యాధులు లేవు. కాని తరుచూ ఆయన మూత్ర విసర్జన చేయడం, మూత్రం చుక్కలుగా రావడం, మూత్రంలో రక్తం పడడం, మూత్ర విసర్జనకు ఎక్కువ సమయం పట్టడం, మూత్రంలో మంట వంటి సమస్యలతో బాధపడుతున్నారు. దీనికి తగిన సలహా ఇవ్వగలరు.
- దినేష్, జగిత్యాల

enlargements
మీరు తెలిపిన వివరాలు, లక్షణాలను బట్టి చూస్తే మీ నాన్నగారికి ప్రొస్టేట్ గ్రంథిలో పెరుగుదల ఉన్నట్టు అనిపిస్తున్నది. చాలామందికి ప్రొస్టేట్ గ్రంథి పరిమాణం పెరగడం వల్ల మీరు తెలిపిన సమస్యలు వస్తాయి. కాబట్టి మీరు ఈ సమస్యను నిర్ధారణ చేసుకోవాలి. ఇందుకోసం అల్ట్రాసౌండ్ స్కాన్ పరీక్ష చేయించుకోవాలి. ఈ పరీక్ష ద్వారా ప్రొస్టేట్ గ్రంథి పరిమాణం బ్లాడర్ పరిమాణం, కిడ్నీ మీద దాని ప్రభావం ఎంతవరకు ఉందో తెలుసుకోవచ్చు. ప్రొస్టేట్ పెరుగుదల సమస్య అందరిలో ఒకేలా ఉండకపోవచ్చు. కొందరిలో చాలాకాలం వరకు ఎటువంటి సమస్య ఉండకపోవచ్చు. ప్రొస్టేట్ పెరుగుతున్న తీరును బట్టి సమస్యలు మొదలవుతాయి.

నిర్ధారణ తరువాత ప్రొస్టేట్ చికిత్స చేయించుకోవాలి. మీరు తెలిపిన లక్షణాలు గల వారికి 80 శాతం మందులతో చికిత్స సరిపోతుంది. 20 శాతం మందికి మాత్రం సర్జరీ అవసరం అవుతుంది. మూత్రంలో రక్తం పడుతున్నప్పుడు ప్రొస్టేట్ గ్రంథి పూర్తిగా తీసివేయాల్సి ఉంటుంది. ఇదివరకు ప్రొస్టేట్ గ్రంథి పెరిగిన పరిమాణాన్ని అనుసరించి గ్రంథిలో కొంత భాగాన్ని చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి తీసేవారు. కాని కొంత కాలానికి తిరిగి మొదలవ్వొచ్చు. కాని ఇప్పుడు పెరిగిన శాస్త్ర పరిజ్ఞానం వల్ల లేజర్ ద్వారా పూర్తిగా గ్రంథిని ఒకేసారి తీసివేయడం సాధ్యపడుతుంది. దీన్ని ట్రాన్స్ యురెత్రర్ రిసెక్షన్ ఆఫ్ ప్రొస్టేట్ (టీయూఆర్‌పి) చికిత్స అంటారు. దీని ద్వారా సమస్యను శాశ్వతంగా తొలగించవచ్చు.

డాక్టర్ పి. వంశీకృష్ణ
కన్సల్టెంట్ యూరాలజిస్ట్
కేర్ హాస్పిటల్స్
హైదరాబాద్

434
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles