మన బలమే దేశ బలం!


Sat,May 26, 2018 01:52 AM

ప్రజలు బాగుంటే దేశం బాగున్నట్టే. ప్రజలు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందినట్టే. మరి ఇవన్నీ కావాలంటే ప్రజలు ఆరోగ్యంగా, బలంగా ఉండాల్సిందే అంటూ వచ్చిందో ఫిట్‌నెస్ చాలెంజ్.
Fitness-Challenge
ఫిట్‌నెస్ చాలెంజ్ రోజురోజుకూ విస్తరిస్తున్నది. సెలబ్రిటీలు దీని బాధ్యతను భుజాల మీద వేసుకొని ప్రచారం చేస్తున్నారు. మనం దృఢంగా ఉంటేనే దేశం దృఢంగా ఉంటుంది. కాబట్టి వ్యాయామం చేసి దేశాన్ని బలపర్చాలి అనే సందేశాన్నిస్తున్నారు. కేంద్ర యువజన సర్వీసుల శాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ ఆలోచన నుంచి వచ్చిన ఈ చాలెంజ్‌ను ఇటీవల క్రికెటర్ విరాట్ కోహ్లీ తీసుకున్నారు. రాజ్యవర్ధన్ విసిరిన సవాల్‌ను స్వీకరించిన కోహ్లీ జిమ్‌లో వెయిట్ లిఫ్టింగ్ చేసి, ఆ చాలెంజ్‌ను ప్రధాని మోడీ, క్రికెటర్ ధోనికి పాస్ చేశారు. అయితే ఇదే చాలెంజ్‌ను తన భార్య అనుష్క శర్మకు కూడా విసిరాడు కోహ్లీ. #HumFitTohIndiaFit #ComeOutAndPlay నినాదాలతో ప్రచారమవుతున్న ఈ చాలెంజ్ సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నది. మన బలమే దేశాన్ని బలంగా తయారుచేస్తుందని దానికోసం ప్రతిఒక్కరూ ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాలని అంటున్నారు.

306
Tags

More News

VIRAL NEWS