రీ వెరిఫికేషన్ చేయండిలా..


Tue,January 16, 2018 11:08 PM

మొబైల్ నంబర్‌ని ఆధార్‌తో లింక్ చేసుకున్నారు కదా! అయితే దీన్ని రీ వెరీఫై చేసుకోవాలనుకుంటున్నారా? దీనికి రెండు నెలలే గడువు ఉంది. అయితే మీరు టెలికాం ఆఫీస్‌కి వెళ్లకుండానే ఇంట్లోనే ఉండి రీ వెరిఫై చేసుకోవచ్చు. ఐవీఆర్ సిస్టమ్‌తో రీ వెరిఫై ఎలా చేసుకోవాలో చూడండి.
aadhar
స్టెప్ 1 : మీరు వెరిఫై చేసుకోవాల్సిన మొబైల్ నంబర్ నుంచి 14546కి కాల్ చేయాలి. అప్పుడు మీరు ఇండియానా? లేదా ఎన్‌ఆర్‌ఐ కస్టమరా? అని అడుగుతుంది. సమాధానం ఇచ్చి ఆ తర్వాత 1ని ప్రెస్ చేసి మీ ఆధార్ నంబర్‌ని పొందుపరుచాలి.

స్టెప్ 2 : ఆధార్ నంబర్‌ని ఖరారు చేసుకోవడానికి మరొకసారి 1ని ప్రెస్ చేయాలి. ఇప్పుడు మీ మొబైల్‌కి వన్‌టైమ్ పాస్‌వర్డ్(ఓటీపీ) వస్తుంది. ఇప్పుడు మీరు ఆ నంబర్‌ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

స్టెప్ 3 : ఇప్పుడు యూఐడీఏఐ డాటా బేస్ నుంచి మీ పేరు, ఫొటో, పుట్టిన తేదీని మీ ఆపరేటర్ తీసుకోవడం ఇష్టమేనా? అని అడుగుతుంది. దానికి మీరు సమాధానం ఇవ్వాలి.

స్టెప్ 4 : ఆ తర్వాత మొబైల్ నంబర్ చివరి నాలుగు అంకెలను ఎంటర్ చేసి ధ్రువీకరించుకోవాలి. ఇప్పుడు ఎసెమ్మెస్ ద్వారా మీకు మరో ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేసి చివరగా ఆధార్, మొబైల్ నంబర్ రీ వెరిఫికేషన్ పూర్తి చేయడానికి 1ని నొక్కాలి.

స్టెప్ 5 : ఒకవేళ మీకు ఇంకో ఫోన్ నంబర్ ఉంటే 2ని ప్రెస్ చేయాలి. పైన పేర్కొన్న విధంగా దానిని కూడా ఆధార్‌కి లింక్ చేయాలి. అయితే ఆ సమయంలో రెండో ఫోన్ నంబర్ కూడా ఆన్‌లో ఉండాలి. ఎందుకంటే దానికి కూడా ఓటీపీ వస్తుంది.

మీ మొబైల్ నంబర్‌కి వచ్చిన ఓటీపీ కేవలం అరగంట మాత్రమే చెల్లుబాటు అవుతుంది. కాబట్టి ఈ లోపలే ఆధార్ అనుసంధాన ప్రక్రియ పూర్తి కావాలి. ఇప్పటికే ఈ ప్రక్రియను ఎయిర్‌టెల్, ఐడియా, వోడాఫోన్ యాక్టివేట్ చేశాయి. బీఎస్‌ఎన్‌ఎల్, జియో సంస్థలు యాక్టివేట్ చేయాల్సి ఉంది.

182
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles