ఆమె ఒక శుభమంగళ


Mon,October 1, 2018 11:12 PM

ఆమెలాంటి వాళ్లంటే సమాజంలో ఒక రకమైన చిన్నచూపు ఉన్నది. అలాంటి చిన్నచూపును వాళ్లు ఎదుర్కొంటున్న వివక్షను పోగొట్టడానికి ఓ ట్రాన్స్‌జెండర్ నడుం బిగించింది. భిక్షాటన, సెక్స్ వర్కర్లుగా కాలం వెల్లదీస్తున్న టాన్స్‌జెండర్స్‌ని అసహ్యించుకునే వాళ్ళందరికీ కాజల్ స్ఫూర్తిగా నిలుస్తున్నది.
kajal-rj
కాజల్‌ది కర్ణాటక రాష్ట్రంలోని మండ్య జిల్లా బ్రహ్మా. చిన్నతనంలోనే తనలో వస్తున్న మార్పులను గమనించి ముంబై వెళ్ళి ట్రాన్స్‌జెండర్‌గా సర్జరీ చేయించుకుని కాజల్‌గా పేరు పెట్టుకున్నది. ఆ తర్వాత కొన్నాళ్ళు అక్కడే బార్‌లో, సర్కస్ కంపెనీలో డ్యాన్సర్‌గా పనిచేసింది. చేస్తున్న వృత్తిలో సంతృప్తి లేకపోవడంతో సొంతూరు బ్రహ్మాకు చేరుకొని చదువుపై శ్రద్ధ పెట్టింది. ఇంటర్ తర్వాత ఎంజీఎం కాలేజ్ ప్రొఫెసర్ మంజునాథ కామత్ సహకారంతో డిగ్రీ చేసింది. కొద్ది రోజులకు కాజల్ నాటకాల్లో పాల్గొంటూ ఉండగా ప్రముఖ దర్శకుడు రవిరాజ్ ఆమె ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాడు. నాట్యం, నాటకం, బుల్లి తెరపై కాజల్ తనదైన శైలిలో ప్రతిభ కనబరిచి అందరి మన్నలనూ పొందింది.


కాజల్‌కు రేడియో సారంగ్ అసిస్టెంట్ డైరెక్టర్ మెల్విన్ పరిచయమయ్యాడు. ఓ కార్యక్రమంలో కాజల్ ప్రసంగాన్ని చూసి ఆమె ప్రతిభకు తగ్గ స్థానాన్ని కల్పించాలనుకున్నాడు. మంగళూరు 107.8 రేడియో ఎఫ్‌ఎంలో కాజల్‌కు రేడియో జాకీగా అవకాశం ఇప్పించాడు. కాజల్ ప్రతి మంగళవారం సాయంత్రం 5గంటల నుంచి 6గంటల వరకు ప్రసారమయ్యే శుభమంగళ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నది. కాజల్ సామాజిక కార్యకర్తగా హక్కుల కోసం పోరాడుతున్నది. తనలాంటి ఎంతోమందికి సాయమందిస్తూ వారి సమస్యలను పరిష్కరిస్తున్నది.

506
Tags

More News

VIRAL NEWS