ఆలూ.. పలు రకాలు!


Sat,August 18, 2018 11:31 PM

డియర్.. కిచెన్‌మేట్స్. ఎందుకని ఇంకా కిచెన్‌లోకి రాలేదు. ఇవాళ సండే కదా నేను అంతగా పిలుస్తున్నా రావడం లేదెందుకు? వారం వారం ఇటు నాన్‌వెజ్ తిని బోర్‌కొట్టీ.. రోజూ పప్పులు.. ఉప్పులు తిని అటు బోర్‌కొట్టి అసలు కిచెన్‌లోకి రావాలంటేనే భయడపుతున్నారన్నమాట. అయితే, మీ భయాన్నిక ఆపేయండి. మీకోసం నేనొచ్చాను. ఆలునై మీ భోజనంలోకి వచ్చాను. రండీ.. ఆదివారం పూట.. అద్భుతమైన విందు కోసం ఇది చదవండి!


potato

వివాహ భోజనంలో

ఆలు కూరకి ప్రత్యేక స్థానం. చుట్టూ ఎన్ని కూరలున్నా చెయ్యి చటుక్కున ఆలు మీదకే వెళుతుంది. దీని రుచికి అలవాటు పడి కొంతమంది డైట్‌ను ఫాలో చేయలేకపోతున్నారంటే అతిశయోక్తి కాదు. రకారకాల కూరలు, సలాడ్స్, పిజ్జా, సమోసాల్లో ఆలును వేస్తూ అద్భుతంగా చేస్తారు. ఇది రుచినే కాదు.. మంచి పోషకాలనూ అందిస్తుంది. ఆలూకు ఉన్న ఫాలోయింగ్‌ను పసిగట్టే ఆగస్టు 19వ తేదీ(ఈరోజు)ని జాతీయ ఆలుగడ్డ దినోత్సవంగా జరుపుకొంటున్నారు.


ఆలు విశేషాలు:

ఆలుగడ్డను మొదటిసారిగా 1536లో యూరప్‌లో స్పెయిన్ పరిచయం చేశారు. ఆలులో 80% నీరు ఉంటుంది. 20% పిండిపదార్థం ఉంటుంది. అరటిపండు కంటే ఎక్కువ పొటాషియం ఆలుగడ్డలో ఉంటుంది. నారింజలో కంటే ఆలులోనే సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ విషయానికి వస్తే ఆపిల్ కన్నా ఎక్కువ ఆలూలోనే ఉంటుంది. ఆలూను వంటల్లోనే కాదు వొడ్కా, పొచ్చీన్, అక్వవిట్ వంటి మద్య పానీయాల తయారీలోనూ వాడుతారు. ప్రపంచంలోనే అధిక ఆలూ ఉత్పత్తిగల దేశం చైనా. ఆలుగడ్డలను చీకటి గదిలో ఎక్కువ సమయం ఉంచడం వల్ల అవి విషంగా మారి పక్షవాతం.. కోమా వంటి రోగాలకు దారితీసే ప్రమాదం ఉంది.

ఆలూ పోషకాలు:

ఆలూను ఉడికించి తినడం కన్నా జ్యూస్ చేసుకొని తాగితే ప్రొటీన్స్ ఎక్కువ మోతాదులో అందుతాయి. ఆలుగడ్డలో సి విటమిన్, కె విటమిన్ పుష్కలంగా ఉంటాయి. కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, నియాసిన్, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. గ్యాస్ట్రిక్, ఎసిడిటీ, అల్సర్స్ వంటి రోగాలను ఆలుగడ్డ నయం చేస్తుందని వైద్యులు చెప్తున్నారు.


neelirangu-aalu

నీలిరంగు ఆలుగడ్డ:

ఇది లోపల, బయట నీలిరంగులో ఉంటుంది. దీన్ని అండ్రోడాక్ బ్లూ అని అంటారు. ఈ ఆలూ ప్రత్యేకత ఏంటంటే ఉడికించినప్పుడు విరగకుండా, రంగును కోల్పోకుండా నీలిరంగులోనే ఉంటుంది.


yukon-gold-potato

యుకోన్ గోల్డ్ ఆలు:

బయట గోధుమ రంగులో ఉండి లోపల బంగారు రంగులో ఉంటుంది. దీనిని 1960లో జీఆర్ జాన్‌స్టన్ కనుగొని 1980లో మార్కెట్‌లో విడుదల చేశారు. దీంట్లో కొవ్వు పదార్థం తక్కువగా ఉండి కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇవి తియ్యగా ఉంటాయి. సలాడ్స్‌లో తినడానికి రుచికరంగా ఉంటాయి.


Norland-Red

నార్లాండ్ రెడ్ ఆలు:

బయట ఎరుపు రంగులో.. లోపల పసుపు రంగులో ఉంటుంది. వీటిని ఉడికించి, ముక్కలుగా చేసి వెన్నతో సర్వ్ చేసుకొంటే రుచికరంగా ఉంటాయి.


Purple-Majesty

పర్పుల్ మెజెస్టీ ఆలుగడ్డ:

బయట.. లోపల ఎరుపు, నీలం కలిసిన రంగును కలిగి ఉంటుంది. ఇది ఎక్కువగా ఉడికించినా రంగు మారదు. సూప్, రోస్ట్, సలాడ్‌లో కలిపితే చాలా రుచిగా ఉంటుంది. ఇది తీపిగా బట్టర్ ప్లేవర్‌ను కలిగి ఉంటుంది. మొదటగా దీనిని ఫ్రాన్స్‌లో కనుగొన్నారు.


Japanese-Sweet-Potato

జపనీస్ స్వీట్ ఆలు:

బయట పింక్.. పర్పుల్ మిళితమైన రంగు.. లోపల గోధుమ రంగుతో ఉంటుంది. రుచికి కొన్ని తీపిగా.. కొన్ని వగరుగా ఉంటాయి. ఇవి జపనీస్ స్వీట్ ఆలు స్లార్చీ క్యాటగిరీకి చెందినవి. వీటిని ఫ్రై చేసినా కూడా ఎక్కువ నూనెను పీల్చుకోదు.


LaRette

లారెట్టే ఆలుగడ్డ:

ఇవి వాక్సీ కేటగిరీకి చెందినవి. చూడటానికి అండాకారంలో ఉంటాయి. మొదటిసారిగా వీటిని డెన్మార్క్‌లో కనుగొన్నారు. బయటి భాగం గోధుమ రంగులో.. లోపలి భాగం బంగారు రంగులో ఉంటుంది. ఉడికించినా రంగును కోల్పోదు. సలాడ్స్.. పిజ్జాలలో బాగుంటాయి.


Jewel-Yam

జెవెల్ యామ్ ఆలు:

ఇవి స్టార్చీ కేటగిరీకి చెందినవి. ఎరుపు రంగులో ఉంటాయి. లోలప మాత్రం ఆరెంజ్ రంగులో ఉంటాయి. ఇవి రుచికి తీపిగా.. జామ్‌లాగా ఉంటాయి.

823
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles