సౌర గమనాన్ని అనుసరించే పండుగ


Mon,January 15, 2018 12:44 AM

హిందూ పండుగల్లో ఏ ఒక్క పండుగ కూడా ప్రతీ సంవత్సరం ఒకే తేదీన రాదు. అవి తిథిని బట్టి మారుతూ ఉంటాయి. కాస్త ముందుగానో, ఆలస్యంగానో వస్తుంటాయి. కానీ మకరసంక్రాంతి మాత్రం ఏటా ఒకే తేదీన (ఆంగ్ల తేదీ ప్రకారం కూడా) రావడం వెనుక ఉన్న రహస్యం ఏమిటో తెలుసా?
sunrise
సంక్రాంతి అంటే సంక్రమణమని అర్థం. రాశుల ఆధారంగా సూర్యుడు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తర రాశిలోకి ప్రవేశించడమే సంక్రాంతి. అందుకే సంవత్సరానికి పన్నెండు సంక్రాంతులు ఉంటాయి. వాటిలో పుష్యమాసం, హేమంత ఋతువులో సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే మకర సంక్రాంతికే అధిక ప్రాధాన్యత. ఆంగ్ల కాలమానం ప్రకారం చూసినా జనవరి 15న సూర్యుడు ఉత్తరాయణ పథంలోకి అడుగుపెడుతాడని స్పష్టమవుతున్నది. అందుకే అన్ని పండుగల్లో సౌరగమనాన్ని అనుసరించి వచ్చే ప్రత్యేక పండుగగా సంక్రాంతికి గుర్తింపు ఉన్నది. క్యాలెండర్ కూడా సౌరగమనాన్నే అనుసరిస్తుంది కాబట్టి, ఏటా జనవరి 15వ తేదీనే మకర సంక్రాంతి వస్తుంది. ఇక మిగిలిన పండుగలన్నీ చాంద్రమానాన్ని అనుసరించి వస్తాయి. అందుకే ఏటికేడు అవి వచ్చే తేదీలు, రోజులు మారుతుంటాయి. ఇక ఆధ్యాత్మికంగానూ మకర సంక్రాంతికి శుభప్రదమైన రోజుగా పేరున్నది. అందుకే స్వచ్ఛంద మరణం కలిగిన భీష్ముడు సంక్రాంతి పర్వదినం వరకు ఆగి ఉత్తరాయణంలో తన పంచప్రాణాలూ వదులుకోవడం ప్రారంభించాడట. మాఘ శుద్ధ ఏకాదశి నాడు ఐదో ప్రాణాన్ని వదిలి తనువు చాలించాడట. ఈ రోజు నుంచి స్వర్గ ద్వారాలు తెరిచి ఉంటాయని పురణాలు చెబుతున్నాయి.

1010
Tags

More News

VIRAL NEWS

Featured Articles