యువ ప్రతిభావంతులు!


Tue,July 31, 2018 11:29 PM

Formal Education will make you a living;Self-Education will make you Forture. ఏదో చదివేస్తే సరిపోదు.. నిన్ను నువ్వు చదవాలి. నిన్ను నువ్వు నేర్చుకోవాలి. మార్చుకోవాలి. తీర్చిదిద్దుకోవాలి. బతకడానికి, బాగా బతకడానికి చాలా తేడా ఉంటుంది. మీరు జస్ట్ బతుకుతున్నారు. వీళ్లు అలా కాదు. తమను తాము మలుచుకున్న సృజనశీలురు. అందుకే ప్రతిష్టాత్మక ఫార్చూన్ వీరిని యువ ప్రతిభావంతులుగా గుర్తించింది. మనదేశం నుంచి ఈ నలుగురే ఈ గుర్తింపు పొందారు.
yuva
ప్రతిష్టాత్మక ఫార్చూన్ యువ ప్రతిభావంతుల జాబితాలో నలుగురు భారతీయ సంతతికి చెందిన వాళ్లు ఉండడం విశేషం. వ్యాపార రంగంలో ప్రతిభ చూపి విజయం సాధించిన వాళ్లకు ఈ జాబితాలో చోటు దక్కుతుంది. మహామహుల పేర్లుండే ఈ జాబితాలో అసమాన ప్రతిభ చూపిన సామాన్యులు కూడా ఉంటారు. భారత్ గర్వించదగ్గ విషయమిది. నలభై మంది జాబితాలో నలుగురు భారతీయ సంతతికి చెందిన వాళ్లున్నారు. ఈ జాబితాలో ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకెర్ బర్గ్, ఇన్‌స్టగ్రామ్ కో ఫౌండర్ కెవిన్ సిస్ట్రోమ్‌లు ఉన్నారు. ప్రతిభకు వయసుతో పనిలేదు. మనం చేసిన పని దాని నుంచి వచ్చిన ఫలితం మనకు గుర్తింపును తీసుకొస్తుందని వీళ్లు నిరూపించారు. విజయం సాధించి విజయమంటే అదేదో దూరతీరం కాదని చాటి చెప్పారు. ప్రపంచ వ్యాపార యువ ప్రతిభావంతులుగా నిలిచారు. ఆ జాబితాలో ఉన్న నలుగురు యువ ప్రతిభావంతుల పరిచయం.

divya-surya-devara
మధ్య తరగతి కుటుంబంలో ఆడపిల్లలు ఎదుర్కొనే కష్టాలన్నింటినీ దివ్య సూర్యదేవర అనుభవించింది. అడ్డంకులు ఛేదించి ఈ విజయాన్ని సాధించింది.దివ్య సూర్యదేవర జనరల్ మోటార్స్ సంస్థకు సీఎఫ్‌ఓగా వ్యవహరిస్తున్నది. చెన్నైలో పుట్టిన దివ్య ఇండియాలోనే చదువుకున్నది. జనరల్ మోటార్స్ 110 యేండ్ల చరిత్రలో అత్యున్నత పదవి బాధ్యతలు చేపట్టి రికార్డులను బద్దలుకొట్టింది. మద్రాస్ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ పూర్తిచేసింది. హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో ఎంబీఏ పట్టా పొందింది. వరల్డ్ బ్యాంక్‌లో ఇంటర్న్‌షిప్ చేసింది. ఆ తర్వాత యూబీఎస్‌లో ఇన్‌వెస్ట్‌మెంట్ బ్యాంకర్‌గా చాలా కాలం పని చేసి అమెరికాలోని నంబర్ వన్ ఆటొమొబైల్ కంపెనీలో పద్నాలుగేళ్లుగా వైస్ ప్రెసిడెంట్, జీఎంగా ఉన్నది.


anjali-sud
ఎక్కడ అవమానించబడ్డామో అక్కడ అభిమానించబడాలి. విజయమంటే అలా ఉండాలి. అప్పుడే మనం పడ్డ కష్టంలో కిక్కుంటుంది. ఊరికే ఏది వచ్చినా దాని విలువ తెలియదు. అంజలి సుధ్ కూడా చాలా కష్టపడింది. ముఖ్యంగా తను చదువుకునే క్రమంలో పడ్డ కష్టానికి ఫలితమే చేస్తున్న ఈ ఉద్యోగమయినా, సాధించిన ఈ విజయమయినా. అంజలి సుధ్ విమియోస సంస్థకు సీఈఓగా పనిచేస్తున్నది. హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో డిగ్రీ పట్టా అందుకున్నది. చదువు తర్వాత అమెజాన్‌లో కొంతకాలం ఉద్యోగం చేసింది. విమియో సంస్థకు గ్లోబల్ మార్కెటింగ్ విభాగంలో లీడర్‌గా చేరింది. కంటెంట్ క్రియేటర్స్ ఎంపిక విషయంలో అంజలి సాధించిన విజయం ఆమెను ఇక్కడి వరకు తీసుకొచ్చింది. తక్కువ కాలంలో ఉన్నత స్థానంలో నిలిచి చాలా మందికి ఆదర్శమయింది. అంజలి ఐఏసీ(ఇంటర్ యాక్టీవ్ కార్పొరేట్) కంపెనీలకు యంగెస్ట్ సీఈఓగా ఎంపికయింది.


baiju-bhatt
సాధారణ యువకులు ఎలా చదువుతారో ఇతను అలాగే చదివేవాడు. కాలేజీలకు బంకులు కొట్టాడు. స్నేహితులతో షికార్లకు వెళ్లాడు. కానీ చదువును నిర్లక్ష్యం చేయలేదు. ఉన్నత విద్య పూర్తయ్యాక ఉద్యోగం చేయలేదు. సొంతంగా స్టార్టప్ పెట్టాలనుకున్నాడు. ఇప్పడు బైజు భట్ రాబిన్‌హుడ్ సంస్థకు కో ఫౌండర్. స్టాక్ బ్రోకరేజ్ వ్యవస్థ స్థాపించి రాబిన్‌హుడ్‌లో విలీనం చేశాడు. కమీషన్ లేకుండా మొబైల్ ఫోన్ల ద్వారా పబ్లిక్ స్టాక్స్ చేసే వెలుసుబాటు తీసుకొచ్చాడు. ఇప్పుడు ఇతడు తయారు చేసిన యాప్‌ను రెండు మిలియన్ల మంది వాడుతున్నారు. డిగ్రీ, పీజీ రెండూ స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో చదివాడు. బైజు చేసిన ప్రయత్నానికి రాబిన్‌హుడ్ సంస్థ ఇప్పుడు లాభాలతో దూసుకెళ్తున్నది. దీంతో బైజు భట్ బిలియనీర్ అయిపోయాడు.


anu-duggal
ఒక మహిళ తాను వ్యాపారం మొదలుపెట్టడమే కష్టమని భావిస్తుంది. సమాజంలో ఉన్న సమస్యలకు వెనుకడుగు వేసి సైలెంట్ అయిపోతుంది. అలాంటిది తను ఒక వ్యాపారాన్ని ప్రారంభించి ఆ వ్యాపారం మహిళా వ్యాపారవేత్తలను అనుసంధానం చేస్తూ ఉండేలా చేయడం మామూలు విషయం కాదు. ఈమె అలాంటి పనే చేస్తున్నది. అనుదుగ్గల్ ఫండ్స్ సంస్థను స్థాపించిన ఫీమేల్ ఫౌండర్. లండన్ బిజినెస్ స్కూల్‌లో చదువుకున్న అను మహిళా పారిశ్రామిక వేత్తలను ఏకతాటిపైకి తీసుకురావడానికి కృషి చేస్తున్నది. వ్యాపార రంగంలో రాణించాలనుకుంటున్న మహిళలకు నిధులు సమకూర్చి వ్యాపారవేత్తలను తయారు చేస్తున్నది. ఇప్పటి వరకు 70 సంస్థలను ప్రారంభింపజేసింది.

1178
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles