అతడు వేల మొక్కలు నాటాడు


Tue,October 2, 2018 11:05 PM

ఒక వ్యక్తి వేల మొక్కలు నాటి వాటి బాగోగులు చూసుకోవడం అంటే ఆషామాషీ కాదు. పోలీస్ ఉద్యోగం చేస్తూనే వేల మొక్కలు నాటిన కానిస్టేబుల్ దేవెందర్ సురా ఎందుకిలా చేస్తున్నాడో తెలుసా?
sonepat-green-mission
పర్యావరణ హితం కోసం అతనొక్కడే వేల మొక్కలు నాటాడు. హర్యానా రాష్ట్రంలోని సోనీపత్ జిల్లా మొత్తం మొక్కలు నాటి తన వంతుగా కాలుష్యకోరల నుంచి కాపాడేందుకు పాటు పడుతున్నాడు. పోలీస్ కానిస్టేబుల్ అయిన దేవెందర్ సురా పచ్చదనంతో ఎంతో సుందరంగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌ను ఆదర్శంగా తీసుకుని హర్యానాను కూడా అలా తీర్చి దిద్దాలనే కలలు కన్నాడు. తన కలను నిజం చేసుకునేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. హర్యానాలోని సోనీ పత్ నగరాన్ని పచ్చదనంగా మార్చేందుకు అహర్నిశలూ శ్రమిస్తున్నాడు. ఒక రోజు, రెండు రోజులు కాదు ఆరేళ్ళపాటు తన సొంత గ్రామంతో సహా సోనీపత్ జిల్లా మొత్తాన్ని హరితవనంలా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాడు. దేవేంద్ర సురా మొదటగా 2012లో ఒక్కడే గ్రీన్ మిషన్‌ను ప్రారంభించి తన సొంత డబ్బులతో మొక్కలను నాటడం మొదలుపెట్టాడు.


ఆ తర్వాత మొక్కలను నాటేందుకు 2వేల మంది సేవకులతో ఓ బృందాన్నే ఏర్పాటు చేశాడు. ఇప్పటి వరకు ఆ బృందం వారు 152 గ్రామ పంచాయతీలలో కొన్ని వేల మొక్కలను నాటారు. ప్రముఖ ఆర్కిటెక్చర్ చండీగఢ్‌ను తన ఆలోచన ప్రకారం ఏవిధంగా పచ్చదనంతో అందంగా ఉండేలా చేశారో అదేవిధంగా తన జిల్లాను మార్చుకునేందుకు సిద్ధమయ్యాడు. అందుకోసం గత ఆరేళ్ల నుంచి రూ.28 లక్షల నుంచి 30 లక్షల వరకూ వెచ్చించాడు. ఉత్తరప్రదేశ్‌లోని వ్యవసాయదారుల నుంచి మొక్కలను కొనుగోలు చేయడానికి అదనంగా డబ్బులు పెట్టాల్సి రావడంతో ఆయనే సొంతంగా నర్సరీని ఏర్పాటు చేసి మొక్కలను పెంచుతున్నాడు. ఎక్కువగా నీడనిచ్చే మొక్కలను దేవాలయాలు, రోడ్ల పక్కన, ఇతర ఖాళీ ప్రదేశాలలో నాటుతున్నాడు.

965
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles